మెగా ఫ్యామిలీలో మరో సర్ ప్రైజ్ ఎంట్రీ
ఈ పాటతో ఒక కొత్త టాలెంట్ టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆమే నైరా. ఈమె ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి సోదరి మాధవి గారి కుమార్తె.;
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న టైంలో మేకర్స్ లేటెస్ట్ గా ఈ మూవీలోని ఫ్లైయింగ్ హై వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ పాటతో ఒక కొత్త టాలెంట్ టాలీవుడ్‌కి పరిచయమైంది. ఆమే నైరా. ఈమె ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి సోదరి మాధవి గారి కుమార్తె. అనిల్ రావిపూడి, నిర్మాత సుస్మిత సోషల్ మీడియా వేదికగా నైరాను పరిచయం చేస్తూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం ఇంట్రెస్టింగ్ గా మారింది.
నైరా సింగింగ్‌లో ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. సింగపూర్‌లోని లాసాల్ కాలేజ్ ఆఫ్ ది ఆర్ట్స్ లో పాప్ మ్యూజిక్ స్టూడెంట్‌గా ఉన్న ఆమెకు ఈ సినిమాలో ఛాన్స్ రావడం ఒక మంచి బిగినింగ్ అని చెప్పొచ్చు. ఫ్లైయింగ్ హై సాంగ్‌లో ఆమె వాయిస్ చాలా ఫ్రెష్ గా ఉండటమే కాకుండా ఈ తరం ఆడియన్స్‌కి నచ్చేలా ఉంది.
నైరా పెర్ఫార్మెన్స్ చూసి సుస్మిత కొణిదెల ఎమోషనల్ అయ్యారు. తన నాన్న సినిమాలో తన కజిన్ పాట పాడటం గర్వంగా ఉందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నైరా వాయిస్‌లో మంచి క్లారిటీ స్టైల్ ఉన్నాయని.. సింగర్‌గా ఆమెకు మంచి ఫ్యూచర్ ఉంటుందని విష్ చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు హీరోలు హీరోయిన్లు మాత్రమే వచ్చారు కానీ ఒక సింగర్ రావడం ఇదే మొదటిసారి.
ఇప్పటికే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి నైరా వేసిన ఈ మొదటి అడుగు చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ఇక మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో మంచి ట్రాక్ లో వెళుతోంది. పండగ సెలవులు ముగిసిన తరువాత కూడా లెక్క ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి.
అనిల్ రావిపూడి మేకింగ్ స్టైల్ లో మెగాస్టార్ కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్ గా సెట్ కావడంతో చాలా రోజుల తరువాత పర్ఫెక్ట్ సినిమా పడింది. ఆడియెన్స్ ఫ్యామిలీస్ తో కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి పోటీ ఎంత ఉన్నా కూడా బాస్ పవర్ ఏమిటో మరోసారి రుజువైంది. ఇక సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ కూడా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది.