ప్రభాస్ వర్సెస్ బన్నీ.. టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎవరిది?

టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎవరిది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది.;

Update: 2026-01-21 11:52 GMT

టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎవరిది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తోంది. కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో స్థానం మారుతూ వస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు మరోసారి అదే ప్రశ్న వినిపిస్తోంది. అగ్రస్థానం ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌ దా? లేక ఐకాన్ స్టార్ బన్నీ అల్లు అర్జున్‌ దా? అంటూ అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు.

నిజానికి బాహుబలి సిరీస్‌ చిత్రాలతో ప్రభాస్ నేషనల్ వైడ్ గా స్టార్‌ డమ్ సంపాదించుకున్నారు. నార్త్ లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. అలా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. బాహుబలి చిత్రాల తర్వాత సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్ వంటి సినిమాలు భారీ బడ్జెట్‌ తో తెరకెక్కాయి. కొన్ని విజయాలు అందుకున్నా, మరికొన్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో ప్రభాస్ కెరీర్‌ లో చిన్న డిస్ట్రబెన్స్ కనిపిస్తోంది. అయినా గ్రాండ్ ప్రెజెన్స్, స్టామినా, ఓపెనింగ్స్ పరంగా ఇప్పటికీ డార్లింగ్ కు ప్రత్యేక స్థానం ఉందన్నది ట్రేడ్ వర్గాల అభిప్రాయం. అదే సమయంలో అల్లు అర్జున్ దూకుడు ఈ మధ్య ఫుల్ గా పెరిగిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుంచి జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ వచ్చిన బన్నీ, క్రమంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్నారు.

ఆర్య, రేసుగుర్రం, సరైనోడు వంటి హిట్లతో స్టార్ రేంజ్‌ కు చేరిన ఆయన, పుష్ప తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. పుష్పరాజ్ పాత్రలో ఆయన యాక్టింగ్, స్టైల్, డైలాగులు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా నార్త్ లో బన్నీకి ఊహించని స్థాయిలో అభిమానులు పెరిగారు. అయితే సినిమా ఎంపికలో కేరింగ్, రోల్ కోసం హార్డ్ వర్క్.. కెరీర్‌ ను ముందుకు నడిపిస్తున్నాయి.

బాక్సాఫీస్ దగ్గర కూడా ఆయన హిట్ రేటు స్ట్రాంగ్ గా ఉంది. వరుసగా భారీ ఓపెనింగ్స్ రాకపోయినా, లాంగ్ రన్ ఆయన ప్రత్యేకతగా మారింది. అయితే ఇద్దరి మధ్య పోలిక చేస్తే.. ప్రభాస్ గ్రాండ్ స్కేల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. భారీ సెట్లు, వీఎఫ్‌ ఎక్స్, పాన్ ఇండియా మార్కెట్‌ లో ఆయన పేరు ఇప్పటికీ పెద్ద బ్రాండ్.

మరోవైపు అల్లు అర్జున్ స్టేబుల్ గా ముందుకు సాగుతున్నారు. యాక్టింగ్, డాన్స్, స్టైల్.. అన్నింటిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆసక్తికరమైన విషయమేమిటంటే.. రాబోయే సినిమాలే కీలకం. ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉండగా, అవి హిట్లుగా నిలిస్తే ఆయన డామినేషన్ పెరుగుతుంది. అదే సమయంలో అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తే.. బన్నీ అగ్రస్థానాన్ని స్టేబుల్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News