నభా గ్లామర్ టచ్.. కొంటె చూపులతో కవ్వింపు!
సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది ప్రముఖ హీరోయిన్ నభా నటేష్.;
సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది ప్రముఖ హీరోయిన్ నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నభా నటేష్ మొదటి సినిమాతోనే కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ లా మారిపోయింది. తర్వాతి కాలంలో ఒక్కో సినిమాలో అవకాశాన్ని అందుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనుకున్న నభా నటేష్ కి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ మంచి హిట్ అందించింది .ఈ సినిమాతో ఇస్మార్ట్ బ్యూటీగా పేరు దక్కించుకుంది.
చివరిగా డార్లింగ్ సినిమాలో నటించిన ఈమె.. 2022 తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు.. కారణం యాక్సిడెంట్.. ఈ యాక్సిడెంట్ తర్వాత మళ్లీ కోలుకున్న ఈమె ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఏకంగా రెండు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా మారింది. అలా స్వయంభు, నాగబంధం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో స్వయంభూ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరొకవైపు తన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.. అందులో భాగంగానే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న నభా నటేష్ మరోసారి గ్లామర్ టచ్ తో సోషల్ మీడియాను హీటెక్కించింది.
వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్న శారీ ధరించి తన అందాలతో మిస్మరైజ్ చేసింది. కొంటెగా కవ్విస్తూ తన చూపులతో మాయ చేసింది. విభిన్నమైన ఫోజులతో ఫోటోలను షేర్ చేసిన నభా నటేష్ అందానికి అభిమానులు ముగ్ధులవుతున్నారు. ఈమధ్య కాలంలో తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇలా రోజుకొక గ్లామర్ ఫోటో షేర్ చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు ఇలా గ్లామర్ ఫోటోలు.. మరొకవైపు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వదులుతూ మరింత పాపులారిటీ అందుకుంది.
ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తోంది. నిఖిల్ సిద్ధార్థ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్లో రాబోతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామాకి భరత కృష్ణమాచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినీవర్గాలలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా డాల్బీ ఆడియోతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులవల్లే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో నభా నటేష్ దీనిపై పూర్తి ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. అలాగే మరొకవైపు నాగబంధం సినిమాలో కూడా నటిస్తోంది. ఈ చిత్రం కూడా సమ్మర్ స్పెషల్ గా రానుంది. ఈ రెండు చిత్రాలు గనక మంచి సక్సెస్ అయితే పాన్ ఇండియా మార్కెట్ అమాంతం పెరిగిపోతుందనడంలో సందేహం లేదు.