'ధురంధర్' సాంగ్‌పై షాకింగ్ అప్ డేట్!
ఇండియన్ సినిమాల్లో ఇంత వరకు చూడని, ట్రై కూడా చేయని స్థాయి మేకింగ్‌తో రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌తో అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన `ధురంధర్` వరల్డ్ బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు.;
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం `ధురంధర్`. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా గ్లోబల్ పాలిటిక్స్, దాని వెనుక ఇండియాపై పాక్ చేసిన దురాగతాలని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఆదిత్యధర్ చేసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాలని షాక్‌కు గురి చేసింది. ఇండియన్ సినిమాల్లో ఇంత వరకు చూడని, ట్రై కూడా చేయని స్థాయి మేకింగ్‌తో రా అండ్ రస్టిక్ క్యారెక్టర్‌తో అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన `ధురంధర్` వరల్డ్ బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ఫస్ట్ పార్టే భీభత్సం సృష్టించింది అనుకుంటే సీక్వెల్‌గా వస్తున్న `ధురంధర్ ది రివేంజ్` దానికి మించిన హింస, ఒళ్లు గగుర్పోడిచే సన్నివేశాలతో రూపొంది అందరిని షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవల విడుదలై ఈ మూవీ టీజర్, ట్రైలర్‌లు సినిమా వరల్డ్ వైడ్‌గా సునామీని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు మోత మోగిస్తోంది. మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్ కానున్న సీక్వెల్ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే `ధురంధర్` సాంగ్‌పై షాకింగ్ అప్ డేట్ ఒకటి బయటికొచ్చి నెట్టింట ట్రెండ్ అవుతోంది. `ధురంధర్`లో సంజయ్‌దత్ ఎంట్రీకి సంబంధించి `హవా హవా..` అంటూ సాగే ఓ సాంగ్ ని తీసుకున్నారు. ఇది 1986లో ఐకానిక్ సాంగ్‌గా విడుదలై యూత్‌ని ఊర్రూతలూగించింది. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్‌గా నిలిచి ఆకట్టుకుంటోంది. అయితే ఈ పాటని రాసింది పాకిస్థాన్‌కు చెందిన సింగర్ హసన్ సహంగీర్ కంపోజ్ చేశాడు. 40 ఏళ్ల క్రితం కంపోజ్ చేసిన పాట ఇప్పటికీ ట్రెండ్ అవుతుండటం విశేషం.
అయితే ఈ పాటకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు హసన్ జహంగీర్. `ధురంధర్` సినిమాలో మీ పాటని వాడుకున్నారు కాదా? మరి మీ నుంచి అనుమతి తీసుకున్నారా? అని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పాడు. `ధురంధర్` టీమ్ తనని సంప్రదించి పర్మీషన్ తీసుకున్నారని, అంతే కాకుండా రాయాల్టీ కింద రూ.46 లక్షలు ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అంతకు ముందు ఈ పాటని బాలీవుడ్ మూవీస్ `బిల్లో బాద్ షా`, ఇన్‌సాఫ్ అప్నే లాహూసే వంటి సినిమాల్లో వాడారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత `ధురంధర్`లో ఉపయోగించుకోవడంతో హసన్ జహంగీర్‌కు కాసుల వర్షం కురిపించింది. 40 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ అతనికి రాయల్టీ పరంగా ఈ పాట డబ్బుల వర్షం కురిపిస్తుండటం గమనార్హం.