పవన్ లో అనూహ్యామైన మార్పు మంచిదే!
ఇది ఆయనలోని కొత్త కోణాన్ని, ముఖ్యంగా ఆయనలోని హాస్య చతురతను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే? గంభీరత, మౌనం గుర్తొస్తాయి. గత రెండు దశాబ్దాలుగా ఆయన సినిమా వేడుకల్లో స్టేజ్ పై కాసేపు ప్రసంగించి వెళ్లిపోవడం మాత్రమే చూశాం. అయితే గడిచిన నాలుగైదు ఏళ్లలో పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌లోనూ, ప్రవర్తనలోనూ చాలా మార్పులు కనిపిస్తున్నాయి. సినిమా ఈవెంట్లలో ఆయన వ్యవహరిస్తున్న తీరు అభిమానులను ఆశ్చర్యపరచడమే కాదు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. స్టేజ్ మీద కేవలం మైక్ పట్టుకుని స్పీచ్ ఇచ్చేందుకే పరిమితమయ్యేవారు. యాంకర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం గానీ, వారితో సరదాగా ముచ్చటించడం గానీ చాలా తక్కువగా కనిపించేది.
కానీ ఇప్పుడు పద్ధతి పూర్తిగా మారింది. స్టేజ్ కింద కూర్చుని కూడా యాంకర్లు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా, చిరునవ్వుతో సమాధానాలు ఇస్తున్నారు. ఆయనలో కనిపిస్తున్న ఈజ్ చూస్తుంటే మళ్లీ పాత పవన్ కళ్యాణ్‌ను మళ్ళీ చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతోంది. గత రెండు సినిమాల ఈవెంట్లను గమనిస్తే పవన్ చాలా రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్నారు. యాంకర్లు అడిగే కొన్ని ఫన్నీ ప్రశ్నలకు కూడా ఆయన అంతే సరదాగా కౌంటర్లు ఇస్తూ అందరినీ నవ్విస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఇలా స్టేజ్ కింద కూర్చుని సరదాగా మాట్లాడటం అనేది సినిమా ప్రమోషన్లకు ఒక కొత్త ఊపుని స్తోంది.
ఇది ఆయనలోని కొత్త కోణాన్ని, ముఖ్యంగా ఆయనలోని హాస్య చతురతను ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది.
ఈ నాలుగైదేళ్ల కాలంలో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటం, ప్రజలతో నిత్యం మమేకం కావడం వల్ల ఈ మార్పు వచ్చి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణ జనాల్లో కలిసి ఉండటం వల్ల ఆయనలో ఉన్న మొహమాటం తగ్గింది. అందరితో ఫ్రీగా మూవ్ అయ్యే తత్వం పెరిగింది. ఇది కేవలం రాజకీయాలకే కాకుండా, సినిమా ఈవెంట్లకు కూడా ఒక కొత్త కళను తీసుకొచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈవెంట్ అంటే కేవలం నాలుగు ప్రసంగాలే కాదు.
సరదా సంభాషణలు కూడా ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. పవన్ సరదా తీరుతో అభిమానుల్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌లో వచ్చిన ఈ మార్పు పరిశ్రమకు , అభిమానులకు మంచి పరిణామం. ఒక సూపర్ స్టార్ తన ఇమేజ్ చట్రం నుండి బయటకు వచ్చి అందరితో సామాన్యంగా కలిసిపోవడం ఆయన వ్యక్తిత్వానికి మరింత వన్నెగా చెప్పొచ్చు. అలాగే సినిమాలపై తనకున్న ఫ్యాషన్ ను ఉద్దేశించి ఎంతో పాజిటివ్ గా మాట్లాడటం సంతోషాన్నిచ్చేదే. గతంలో సినిమాల కంటే సేవే ఎక్కువని మాట్లాడిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ తాజా ఈవెంట్లో సినిమాలకు ఆయన వేసిన పెద్ద పీట ఎంతో కీలకమైందని చెప్పొచ్చు.