చిలిపి కృష్ణగా అమర్దీప్ సందడి.. నవ్వుల విందుగా 'సుమతి శతకం' ఇంటర్వ్యూ!
బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'సుమతి శతకం'. ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ రీసెంట్ గా ఒక హిలేరియస్ ఇంటర్వ్యూ ఇచ్చింది.;
బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'సుమతి శతకం'. ఫిబ్రవరి 6న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ రీసెంట్ గా ఒక హిలేరియస్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో సినిమా విశేషాలతో పాటు షూటింగ్ టైంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ పంచుకున్నారు.
ఈ సినిమాలో అమర్దీప్ 'కృష్ణ' అనే విలేజ్ యువకుడి పాత్రలో కనిపిస్తున్నారు. ప్రతి ఊరిలో ఉండే ఒక అల్లరి అబ్బాయిలా తన క్యారెక్టర్ ఉంటుందని, ఆ ఎనర్జీ అందరికీ కనెక్ట్ అవుతుందని అమర్దీప్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇంటర్వ్యూలో హైలైట్ ఏంటంటే.. టేస్టీ తేజ, మహేష్ వంటి కమెడియన్ల ట్రాక్. ఊరిలో వీళ్ళు పెట్టే పంచాయితీలు, వాటి వల్ల కృష్ణ పడే ఇబ్బందులు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయని టీమ్ ప్రామిస్ చేస్తోంది.
హీరోయిన్ సైలీ చౌదరి కూడా ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. అమర్దీప్ కి, ఆమెకు మధ్య వచ్చే సీన్స్ కంటే కూడా సాంగ్స్‌లో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయిందట. సినిమా మొత్తం ఒక పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో, నేచురల్ హ్యూమర్‌తో సాగుతుందని డైరెక్టర్ నాయుడు గారు తెలిపారు. సంక్రాంతికి పెద్ద సినిమాలు చూసి ఎంజాయ్ చేసిన ఆడియన్స్‌కి, ఫిబ్రవరిలో ఈ సినిమా ఒక ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతోంది. ఎటువంటి సోషల్ మెసేజ్ లు కాకుండా, కేవలం ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునేలా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
సినిమా టీమ్ వివరాలు:
మూవీ : సుమతి శతకం
హీరో : అమర్దీప్ చౌదరి
హీరోయిన్ : సైలీ చౌదరి
దర్శకుడు : ఎం.ఎం. నాయుడు
నిర్మాత : సాయి సుధాకర్ కొమ్మాలపాటి
సమర్పణ : కొమ్మాలపాటి శ్రీధర్
సంగీత దర్శకుడు : సుభాష్ ఆనంద్
డిఓపి : ఎస్. హలేష్
ఎడిటర్ : నాహిద్ ముహమ్మద్
పిఆర్ఓ : మధు విఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం