'ధురంధర్2' లో సర్‌ప్రైజింగ్ స్టార్?
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1300 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లని వెనక్కి నెట్టింది.;
దేశ వ్యాప్తంగా సంచనం సృష్టించిన చిత్రం `ధురంధర్`. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ మూవీ ఎంతటి వివాదాస్పదంగా నిలిచిందో బాక్సాఫీస్ వద్ద అంతే స్థాయిలో వసూళ్లని రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. 2025లో విడుదలైన ఇండియన్ సినిమాల్లో `ధురంధర్` ఆత్యధిక కలెక్షన్‌లని వసూలు చేసిన సినిమాగా రికార్డులు సొంతం చేసుకుంది. ప్రాపగండ సినిమా అని విమర్శలు గుప్పించినా.. పాకిస్థాన్ వ్యతిరేక సినిమా అని ప్రచారం జరిగినా వాటిన్నింటినీ లెక్కచేయకుండా బాక్సాఫీస్ వద్ద ర్యాపేజ్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1300 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లని వెనక్కి నెట్టింది. గత కొంత కాలంగా వరుస పరాజయాలతో రేసులో వెనకబడిన రణ్‌వీర్ సింగ్‌ని మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చింది. ఈ సినిమా సాధించిన విజయంపై విమర్శకులతో పాటు ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా పాపులర్ స్టార్స్ అంతా `ధురంధర్`పై అభినందనల వర్షం కురిపించారు.
భారత్, పాక్ దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న ఓ సీరియస్ ఇష్యూని అంతే సీరియస్‌గా రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో దర్శకుడు ఆదిత్య ధర్ ఈ మూవీని తెరకెక్కించిన తీరు ప్రతీ ఒక్కరినీ షాక్‌కు గురి చేసింది. ఐఎస్ ఐ, గ్యాంగ్‌స్టర్స్, టెర్రిరిస్టు గ్రూపుల్ని అడ్డం పెట్టుకుని మనపై పాక్ చేస్తున్న కుటిల యుద్దాన్ని కూకటి వేళ్లతో పెకిలించే క్రమంలో ఇండియన్ ఇంటలిజెన్స్ రా ఏజెంట్‌ని ఎలా పాక్‌లోకి ఇన్ బిల్ట్ చేసింది. తన ద్వారా ఎలా ఉగ్రవాదులకు సహకరిస్తున్న గ్యాంగ్ స్టర్ల ఆట కట్టించింది అనే షాకింగ్ సన్నివేశాలతో, నిజ జీవిత సంఘటల ఆధారంగా మూవీని చేయడంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా హర్షాతికేకాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకుని పలు రికార్డుల్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా రానున్న `ధురంధర్ 2: ది రివేంజ్`పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనవరి 23న టీజర్‌ని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్ట్ 2లో దర్శకుడు ఆదిత్యధర్ ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశాడోననే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పార్ట్ 1లో సంజయ్‌దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపల్, మాధవన్ వంటి హేమా హేమీలని రంగంలోకి దించిన ఆదిత్యధర్ పార్ట్ 2 కోసం ఓ స్పెషల్ స్టార్‌ని దించేస్తున్నాడని తెలిసింది.
తనే విక్కీ కౌశల్. ఆదిత్య ధర్ రూపొందించిన వార్ యాక్షన్ డ్రామా `యూరి ది సర్జికల్ స్ట్రైక్` ఏ స్థాయి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో విక్కీ కౌశల్ మేజర్ విహాన్ సింగ్ షేర్‌గిల్‌గా నటించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే క్యారెక్టర్‌ని `ధురంధర్ 2`లోనూ చూపించబోతున్నారట. ఆ కారణంగానే విక్కీ కౌశల్ ఈ మూవీలో కనిపించబోతున్నాడని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అంటే ధురంధర్ యూనివర్స్‌లోకి `యూరి ది సర్జికల్ స్ట్రైక్` యూనివర్స్‌ని కలిపి సరికొత్త సినిమాటిక్ యూనివర్స్‌కి ఆదిత్య ధర్ తెరలేపబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉంటే `ధురంధర్ 2`ని మార్చి 19న బారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది.