'తెలుగులో అరుదైన మూవీ మాదే'.. 'మృత్యుంజయ్' సక్సెస్ మీట్ లో విష్ణు
ముఖ్యంగా హుస్సేన్ షా కిరణ్ రాసిన కథ, అందులోని ట్విస్ట్లు ఆకట్టుకున్నాయని తెలిపారు. సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్ట్రాంగ్ ఎలిమెంట్ గా మారిందన్నారు.;
యంగ్ హీరో శ్రీవిష్ణు లీడ్ రోల్ లో నటించిన మృత్యుంజయ్ మూవీ రీసెంట్ గా రిలీజై.. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమాకు హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా సాలిడ్ వసూళ్లతో సందడి చేస్తోంది. దీంతో థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ తాజాగా జరగ్గా.. మూవీ టీమ్ అంతా పాల్గొంది.
సక్సెస్ మీట్ లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, సినిమాను చూసిన ప్రేక్షకులంతా ప్రశంసిస్తున్నారని తెలిపారు. నిర్మాత సందీప్ గుణ్ణం, పవన్ గారితో కలిసి ఒక సినిమా చేయాలని అప్పట్లో అనుకున్నామని చెప్పారు. ఆ సమయంలోనే దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ను పరిచయం చేశారని తెలిపారు. సినిమా పూర్తిగా కంటెంట్ ఆధారంగా ఉండాలని నిర్మాత నిర్ణయించారని అన్నారు.
సినిమా షూటింగ్ సమయంలో సెట్స్ లో ఎక్కువగా రమ్య గారు ఉండేవారని, ఆమె అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పారు. సినిమాలో నటించిన సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప శర్మ, రెబా, చిన్నారి ఊహ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ప్రేక్షకులు కొత్త అనుభూతిగా మూవీని భావిస్తున్నారని అన్నారు. సినిమాలో ప్రతి పాత్రను దర్శకుడు కొత్తగా చూపించారని పేర్కొన్నారు.
ముఖ్యంగా హుస్సేన్ షా కిరణ్ రాసిన కథ, అందులోని ట్విస్ట్లు ఆకట్టుకున్నాయని తెలిపారు. సంగీత దర్శకుడు కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్ట్రాంగ్ ఎలిమెంట్ గా మారిందన్నారు. ఆర్ఆర్ చూసిన తర్వాత తాను కూడా ఆశ్చర్యపోయానని, చిత్రానికి నిజమైన హీరో కాలభైరవేనని వ్యాఖ్యానించారు. ఇంకా చూడని ప్రేక్షకులు ఉంటే తప్పకుండా థియేటర్లలో చూడాలని కోరారు. తెలుగులో చాలా అరుదుగా వచ్చే మంచి థ్రిల్లర్ సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ, సినిమాను ప్రమోట్ చేసేందుకు పాటలు లేదా కామెడీ సీన్లు ఉపయోగించలేదని చెప్పారు. సినిమా కంటెంట్ మీద నమ్మకం పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చామని తెలిపారు. ప్రేక్షకుల స్పందన ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. మూవీ జర్నీలో నిర్మాతలు రమ్య, వినయ్, సందీప్ ఎంతో సపోర్ట్ చేశారని చెప్పారు. చిన్నారి ఊహ అద్భుతంగా నటించిందని ప్రశంసించారు. రచ్చ రవి, సుదర్శన్ వంటి నటీనటుల యాక్టింగ్ ఎంతో బాగుందని అన్నారు. కాలభైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింత పెంచిందని తెలిపారు.
సినిమా సాధ్యమైనందుకు ప్రధాన కారణం శ్రీ విష్ణు అని దర్శకుడు పేర్కొన్నారు. ఆయన కథను నమ్మి అంగీకరించడంతో మూవీ తెరకెక్కిందని చెప్పారు. తనపై ఆయన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నానని అన్నారు. నిర్మాత సందీప్ గుణ్ణం మాట్లాడుతూ మీడియా తమ సినిమాకు మొదటి రోజు నుంచి మంచి మద్దతు ఇచ్చిందని చెప్పారు. మీడియా రివ్యూలు, ప్రేక్షకుల మౌత్ టాక్ కలిసి సినిమా విజయానికి దోహదపడ్డాయని తెలిపారు. తమ సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏదేమైనా మృత్యుంజయ్ విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా, ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలని మూవీ టీమ్ కోరుతోంది.