బాలీవుడ్ బైసెప్స్ క్రేజ్.. హృతిక్ రోషన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అంటేనే గుర్తొచ్చేది అదిరిపోయే ఫిజిక్, డ్యాన్స్. వయసు పెరుగుతున్నా తన బాడీని మెయింటైన్ చేయడంలో అతను ఎప్పుడూ ముందుంటారు.;
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అంటేనే గుర్తొచ్చేది అదిరిపోయే ఫిజిక్, డ్యాన్స్. వయసు పెరుగుతున్నా తన బాడీని మెయింటైన్ చేయడంలో అతను ఎప్పుడూ ముందుంటారు. లేటెస్ట్ గా హృతిక్ సోషల్ మీడియాలో తన ఫిట్నెస్ జర్నీకి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. 1984 నుంచి నిన్నటి వరకు తన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ ఎలా సాగిందో చూపిస్తూ పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సాధారణంగా సెలబ్రిటీలు తమ సక్సెస్ గురించి లేదా కొత్త సినిమాల గురించి పోస్టులు పెడుతుంటారు. కానీ హృతిక్ మాత్రం తనలోని ఒక చిన్న వీక్నెస్ లేదా అబ్సెషన్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడారు. ఎన్ని పుస్తకాలు చదివినా, జీవితం గురించి ఎంతటి అవగాహన పెంచుకున్నా.. తనలోని ఒక పాత అలవాటు మాత్రం అస్సలు పోవడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ మాటే ఇప్పుడు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా ఈ "బాలీవుడ్ బైసెప్స్" మీద తనకు ఉన్న పిచ్చి అస్సలు తగ్గడం లేదని హృతిక్ నిజాయితీగా ఒప్పుకున్నారు. జిమ్ లో వర్కౌట్ చేస్తూ తన బైసెప్స్ చూపిస్తున్న ఫోటోలను పోస్ట్ చేస్తూ.. "నేను దీని నుంచి ఎప్పటికైనా బయటపడతానని ఆశిస్తున్నాను, నా కోసం ప్రార్థించండి" అంటూ సరదాగా రాశారు. ఫిట్నెస్ పై ఆయనకున్న ఆ క్రేజ్ వల్లే నేటి తరం యువతకు కూడా ఒక ఐకాన్ గా నిలిచారు.
హృతిక్ గత ఏడాది 'వార్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోయింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, అందులో హృతిక్ పర్ఫార్మెన్స్ లుక్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా తర్వాత వస్తున్న ఇలాంటి పర్సనల్ అప్‌డేట్స్ ఫ్యాన్స్ లో మళ్ళీ జోష్ నింపుతున్నాయి.
ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ 'క్రిష్ 4' అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. సూపర్ హీరో మూవీగా ఇండియాలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ ఫ్రాంచైజీ నుంచి నాలుగో పార్ట్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఉన్నారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి అప్‌డేట్స్ రావాల్సి ఉన్నప్పటికీ, హృతిక్ తన బాడీని ఇలా పక్కాగా సిద్ధం చేసుకుంటున్నారంటే త్వరలోనే క్రిష్ గా రాబోతున్నారని అంతా ఫిక్స్ అయిపోతున్నారు.
ఏదేమైనా హృతిక్ రోషన్ తన "బాలీవుడ్ బైసెప్స్" అబ్సెషన్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్స్ పక్కన పెడితే, తన ఫిట్నెస్ విషయంలో చూపిస్తున్న డెడికేషన్ మాత్రం మెచ్చుకోదగ్గది. బహుశా అందుకే ఆయన బాలీవుడ్ లో ఎప్పటికీ మోస్ట్ స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్నారు.