సౌత్ సుందరీమణుల మధ్య నార్త్ యుద్ధం!

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో భాషా సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వెళ్ళిన హీరోయిన్లు బాలీవుడ్‌ను ఏలుతున్నారు.;

Update: 2026-03-15 23:30 GMT

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో భాషా సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వెళ్ళిన హీరోయిన్లు బాలీవుడ్‌ను ఏలుతున్నారు. ఈ క్రమంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇప్పటికే అక్కడ పాగా వేసింది. తాజాగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా భారీ ప్రాజెక్టులతో ఎంట్రీ ఇస్తోంది. రాబోయే రోజుల్లో బాలీవుడ్ టాప్ లీగ్‌లో ఈ ఇద్దరు దక్షిణాది నటీమణుల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇద్ద‌రి శైలి వేరైనప్పటికీ,బాక్సాఫీస్ వీరి ప్రభావం మాత్రం సమానంగా ఉండేలా కనిపిస్తోంది.

రష్మిక మందన్నా ఇప్పటికే బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. యానిమల్ విజ‌యంతో గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అటుపై విక్కీ కౌశల్ సరసన న‌టించిన చావా వంటి భారీ పీరియాడిక్ సినిమాతో న‌టిగా మ‌రింత స‌త్తా చాటింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు గ్లామర్ మాస్ అప్పీల్ ఉన్న కథలను ఎంచుకోవడంలో రష్మిక సిద్ధహస్తురాలు. బాలీవుడ్ యూత్‌లో ఆమెకున్న క్రేజ్ పెద్ద నిర్మాణ సంస్థలతో ఆమెకున్న అనుబంధం రష్మికను రేసులో ముందు వరుసలో నిలబెడుతున్నాయి. అమ్మ‌డు ఎంచుకునే ప్రతి ప్రాజెక్ట్ పక్కా కమర్షియల్ ప్లాన్‌తో క‌నిపిస్తోంది.

అలాగే సాయి పల్లవి తనదైన ముద్రతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. రణబీర్ కపూర్ సరసన అత్యంత ప్రతిష్టాత్మకమైన రామాయణ చిత్రంలో సీతగా నటిస్తూ నేరుగా టాప్ లీగ్‌లోకి ప్రవేశించింది. సాయి పల్లవి బలం ఆమె సహజ సిద్ధమైన నటన , అద్భుతమైన డ్యాన్స్. గ్లామర్ కంటే కంటెంట్ , పర్‌ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే నార్త్ ఆడియన్స్‌ను ఆమె సులభంగా ఆకట్టుకోగలదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రష్మిక ఒక కమర్షియల్ స్టార్‌గా కనిపిస్తే, సాయి పల్లవి ఒక క్లాసిక్ , పవర్‌ఫుల్ పెర్పార్మ‌ర్ గా తెరపై మెరవబోతోంది.

అయితే ఇద్దరి మధ్య పోటీ అనేది కేవలం సినిమాల సంఖ్యపై మాత్రమే ఉండదు. ఎంచుకునే పాత్రల వైవిధ్యంపై కూడా ఉంటుంది. రష్మిక మోడరన్ , గ్లామరస్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుంది. సాయి పల్లవి సంప్రదాయబద్ధమైన , బరువైన పాత్రలతో మంత్రముగ్ధులను చేస్తుంది. బాలీవుడ్ దర్శక-నిర్మాతలు ఇప్పుడు కంటెంట్ డ్రివెన్ సినిమాల వైపు మొగ్గు చూపుతుండటంతో ఇద్దరు భామలకు అక్కడ తిరుగులేని అవకాశాలు వస్తున్నాయి. రష్మిక ఇప్పటికే అక్కడ స్థిరపడగా, సాయి పల్లవి ఇచ్చే టఫ్ కాంపిటీషన్ బాలీవుడ్ బాక్సాఫీస్స మీకరణాలను మార్చేయడం ఖాయం. భ‌విష్య‌త్ లో రష్మిక - సాయి పల్లవి మధ్య పోటీ బాలీవుడ్‌కు ఒక కొత్త కళను తీసుకొచ్చే అవకాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి

Tags:    

Similar News