'శౌర్యంగా పర్వం'కు ముందు హోంబలే భారీ ప్లాన్స్!
అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభాస్ రేంజ్ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. రూ.270 కోట్లకు మించిన బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైనే రాబట్టింది.;
పాన్ ఇండియాస్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ డ్రామా `సలార్`. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించింది. `కేజీఎఫ్` సిరీస్ సినిమాల తరువాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడం, ఇందులో ప్రభాస్ నటించడంతో దీనిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. టీజర్‌తో సంచలనాలకు తెరలేపిన ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్రభాస్ రేంజ్ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. రూ.270 కోట్లకు మించిన బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైనే రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా `సలార్ 2 శౌర్యాంగ పర్వం`ని చేస్తామని సినిమా ఎండింగ్‌లో ప్రకటించింది టీమ్. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ `డ్రాగన్` పనుల్లో బిజీగా ఉండటం, ప్రభాస్ ఇతర పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి `ఫౌజీ`, సందీప్ రెడ్డి వంగ `స్పిరిట్`తో పాటు `కల్కి` సీక్వెల్ లలో నటిస్తున్నాడు. ఇవి మూడు కంప్లీట్ కావాలంటే టైమ్ పడుతుంది. దీంతో హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్ కోసం కొత్త ప్లాన్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ రేంజ్‌కి తగ్గ ప్రొటెన్షియల్ ఉన్న స్టోరీతో ఓ భారీ యాక్షన్ డ్రామాని చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం అప్పుడే డైరెక్టర్ల వేట కూడా మొదలు పెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో క్రేజీ మూవీస్‌తో పాపులర్ అయిన డైరెక్టర్ల వెంటపడుతోంది.
ఇప్పటికే తమిళ ఇండస్ట్రీ నుంచి ఓ డైరెక్టర్‌ని, మలయాళ ఇండస్ట్రీ నుంచి ఓ డైరెక్టర్‌ని ఎంపిక చేసి వారితో చర్చలు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. శివ కార్తికేయన్‌తో `అమరన్` వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించారు దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి తనని ప్రభాస్ మూవీ కోసం ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇటీవలే తనతో హొంబలే మేకర్స్ చర్చలు జరుపుతున్నారని ఇన్ సైడ్ టాక్. ఇక మలయాళ డైరెక్టర్ దింజిత్ అయ్యాతన్‌ని కూడా అనుకుంటున్నారని. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిసింది.
త్వరలోనే ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసి ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్‌ని ప్రకటించే ఆలోచనలో హోంబలే ఫిల్మ్స్ వర్గాలు ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే `సలార్ 2 శౌర్యాంగ పర్వం`కు ముందు ప్రభాస్‌తో భారీ సినిమాకు హొంబలే భారీ స్కెచ్ వేస్తోందన్నమాట. మరి `సలార్ 2` ఇప్పట్లో లేనట్టేనని తేల్చేసినట్టేనని కన్నడ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.