ఆ ముగ్గురు సేఫ్ జోన్ నుంచి బయటకొస్తున్నారు!
దర్శకులలో ఒక్కోక్కరిది ఒక్కో ప్రత్యేకమైన శైలి. అనిల్ రావిపూడి అంటే కామెడీ, త్రివిక్రమ్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రశాంత్ నీల్ అంటే భారీ యాక్షన్ బ్లాక్‌లు గుర్తుకువస్తాయి.;
దర్శకులలో ఒక్కోక్కరిది ఒక్కో ప్రత్యేకమైన శైలి. అనిల్ రావిపూడి అంటే కామెడీ, త్రివిక్రమ్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రశాంత్ నీల్ అంటే భారీ యాక్షన్ బ్లాక్‌లు గుర్తుకువస్తాయి. అయితే ఇప్పుడు ఈ ముగ్గురు అగ్ర దర్శకులు తమ బ్రాండ్ ఇమేజ్‌ను పక్కన పెట్టి మునుపెన్నడూ చేయని సరికొత్త జోనర్లలోకి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తమ మేకింగ్ స్టైల్‌ను మార్చాలనే నిర్ణయానికి వచ్చినట్లు సన్నిహితుల నుంచి అందుతోన్న సమచారం. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే.. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కానీ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో ఆయన రూట్ మార్చారు.
ప్రస్తుతం వెంకటేష్‌తో చేస్తున్న సినిమా అనంతరం అనిల్ రావిపూడి ఒక పూర్తి స్థాయి ఫాంటసీ జోనర్ కథను ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కేవలం నవ్వులకే పరిమితం కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ , టెక్నికల్ వండర్స్‌తో కూడిన సినిమాను రూపొందించడం ద్వారా తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్క రించాలని అనిల్ భావిస్తున్నాడుట.
అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా తన శైలిని పూర్తిగా మార్చుకుంటున్నారుట. దశాబ్దాలుగా ఫ్యామిలీ డ్రామాలు , ప్రాసలతో కూడిన సంభాషణలతో మేజిక్ చేసిన ఆయన ఇప్పుడు మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్ వైపు మొగ్గు చూపుతున్నారు.
భారీ బడ్జెట్‌తో ఒక పురాణ గాథను -సోషియో-ఫాంటసీ కథను పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిం చేందుకు సిద్ధమవుతున్నారు. మిడిల్ క్లాస్ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్‌తో ఒక విజువల్ కాన్వాస్‌ను నిర్మించడం త్రివిక్రమ్ కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారనుంది. ఈ సినిమా హీరో విషయంలో ఇప్పటికే సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా కొత్త జానర్ ని టచ్ చేసే ఆలోచనలో ఉన్నాడు. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో డార్క్ షేడ్ భారీ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తోన్న సినిమాతో వాటికి భిన్నంగా ఉంటుందనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. ఈ సినిమాతో తన పంథాను మార్చుకుం టున్నారనే వార్తలొస్తున్నాయి. ఇదీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ తన గచిత్రాల్లోని కోల్డ్ అండ్ డార్క్ స్టైల్ నుంచి బయటకు వచ్చి చేస్తోన్న చిత్రంగా తెలుస్తోంది. స్టైలిష్‌గా , కలర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం. ఎమోషన్స్ , స్టోరీ టెల్లింగ్‌లో తనలోని సరికొత్త వెర్షన్‌ను చూపిం చేందుకు నీల్ కసరత్తు చేస్తున్నారు. తారక్ సినిమా అనంతరం చేయబోచేయు సినిమా అయితే పూర్తిగా కొత్త జానర్లోనే ఉంటుందని సన్నిహిత వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. ఈ మార్పు గనుక నిజమైతే? ఒకశుభపరిణామమే. ఒకే రకమైన కథలతో బోర్ కొట్టించకుండా, ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకునేలా కొత్త ప్రయోగాలు చేయడం వల్ల తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుంది.