బాబి బర్తడే స్పెషల్.. మెగా158 నుండి అదిరిపోయే వీడియో రిలీజ్!

ఇదిలా ఉండగా మరొకవైపు నేడు బాబీ కొల్లి పుట్టిన రోజు కావడంతో మెగా 158 మూవీ షూటింగ్ సెట్ నుండి మేకర్స్ పంచుకున్న ఒక స్పెషల్ వీడియో బాబి డెడికేషన్ కు అద్దం పడుతోంది.

Update: 2026-08-01 06:01 GMT

ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి గతంలో మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే మెగాస్టార్ చిరంజీవితో మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.. ఇదిలా ఉండగా మరొకవైపు నేడు బాబీ కొల్లి పుట్టిన రోజు కావడంతో మెగా 158 మూవీ షూటింగ్ సెట్ నుండి మేకర్స్ పంచుకున్న ఒక స్పెషల్ వీడియో బాబి డెడికేషన్ కు అద్దం పడుతోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బాబి కొల్లి బర్తడే స్పెషల్..

ప్రముఖ డైరెక్టర్ బాబీ పుట్టినరోజు సందర్భంగా మెగా 158 చిత్ర బృందం ఒక ప్రత్యేక వీడియోని విడుదల చేసింది. అందులో డైరెక్టర్ బాబీ తన పనిలో ఎంతగా నిమగ్నమై.. కష్టపడి అంకిత భావంతో పనిచేస్తున్నారో మనం ఆ వీడియోలో చూడవచ్చు. ప్రతి ఫ్రేమ్ ను ఆయన పరిపూర్ణం చేస్తున్నారు. ప్రతి సీన్ కి ప్రాణం పోయాలనే ఆయన పట్టుదల ఈ మెగా 158 చిత్రంపై అంచనాలను మరో స్థాయికి పెంచింది అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా మెగా 158 నుండి బాబీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ తెర వెనుక వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి మూవీపై అంచనాలు పెంచేసింది.

మెగా 158 మూవీ విశేషాలు..

ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లి తన సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని ఒక సరికొత్త అవతారంలో చూపించడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే ఆయన స్టైలిష్ లుక్ కోసం ఒక కొత్త రూపంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. షూటింగుకు ముందు విడుదలైన స్టిల్స్, ఆయన లుక్కు పై భారీగా చర్చకు కూడా దారితీశాయి. చిత్ర బృందం ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడించకపోయినప్పటికీ డైరెక్టర్ బాబీ కొల్లి మాత్రం చిరంజీవికి స్టైలిష్ లుక్ ఇవ్వడంలో పేరుగాంచారు అనే చెప్పాలి.

ఇప్పటికే పలు సన్నివేశాలు షూటింగ్ పూర్తి..

కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిత్ర బృందం ఉత్కంఠ భరితమైన ,అత్యంత యాక్షన్ ఇంటర్వెల్ ఎపిసోడ్ షూటింగ్ ను పూర్తి చేసింది. త్వరలోనే ఈ సినిమా నుండి ఒక కొత్త అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

డైరెక్టర్ బాబి కొల్లి విషయానికి వస్తే.. కె ఎస్ రవీంద్ర గా పేరు సొంతం చేసుకున్న ఈయన బాబీగా చలామణి అవుతున్నారు. స్క్రీన్ రైటర్ గా, చలనచిత్ర దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న బాబి గుంటూరులో పుట్టి, పెరిగారు. బీకాంలో డిగ్రీ పట్టా అందుకున్నారు . భద్రాద్రి అనే చిత్రానికి స్టోరీ అందించిన ఈయన తొలిసారి పవర్ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. జై లవకుశ ,సర్దార్ గబ్బర్ సింగ్ , వెంకీ మామ, వాల్తేరు వీరయ్య, డాకు మహారాజ్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబీ .. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మరో సినిమా తీస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.



Tags:    

Similar News