ఆగస్టులో విడుదల కాబోతున్న చిత్రాలు.. ఆ 2 మాత్రం డోంట్ మిస్!

సంక్రాంతి తర్వాత కొంత నెమ్మదించిన బాక్సాఫీస్, ఇటీవల వచ్చిన విజయాలు, డబ్బింగ్ సినిమాల హవా కారణంతో మళ్లీ ఊపందుకుంది.

Update: 2026-08-01 07:19 GMT

సంక్రాంతి తర్వాత కొంత నెమ్మదించిన బాక్సాఫీస్, ఇటీవల వచ్చిన విజయాలు, డబ్బింగ్ సినిమాల హవా కారణంతో మళ్లీ ఊపందుకుంది. ఇక పండుగలు, ప్రభుత్వ సెలవులు ఎక్కువగా ఉన్న ఆగస్టు నెలలో థియేటర్లలో సినిమాల పండగ రాబోతోంది. ఈ నెలలో విడుదల కాబోతున్న క్రేజీ సినిమాలు, ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ రెండింటి విశేషాలు మీకోసం.

తొలివారం నుంచే పోటీ షురూ:

ఆగస్టు మొదటి వారంలోనే వరుణ్ తేజ్ నటిస్తున్న 'కొరియన్ కనకరాజు' థియేటర్లలోకి రాబోతోంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ ఈ సినిమాపై బాగానే బజ్ పెంచుతున్నారు. ఇక దీనితో పాటు తమిళ అనువాద చిత్రం 'డిసి', దీక్షిత్ శెట్టి నటిస్తున్న 'కెజెక్యూ' చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి.

రెండో వారంలో వెరైటీ మూవీస్:

రెండో వారంలో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ 'విశ్వనాథ్ అండ్ సన్స్' రాబోతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం, సూర్య ఇమేజ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కానున్నాయి. ఇక వీరితో పాటు ఎంఎస్ రాజు తీసిన హారర్ చిత్రం 'అగథ', అన్నపూర్ణ సంస్థ సమర్పిస్తున్న 'పళ్ళబురుసు' చిత్రాలు వినూత్న ప్రచారంతో అలరిస్తున్నాయి.

అయ్యప్ప ఎలిమెంట్‌తో మాస్ రాజా:

ఆగస్టు 21న మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' విడుదలకు సిద్ధమైంది. ఇక ఇందులో ఉన్న అయ్యప్ప స్వామి బ్యాక్‌డ్రాప్, డివోషనల్ కాన్సెప్ట్ ఇప్పటికే ప్రేక్షకుల్లోకి బాగా దూసుకెళ్లింది. దీనికి ఒక రోజు ముందుగానే దుల్కర్ సల్మాన్ 'ఐ యామ్ గేమ్', పృథ్విరాజ్ సుకుమారన్ 'ఖలీఫా' చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి.

యశ్ ‘టాక్సిక్’:

ఈ నెలలోనే బిగ్గెస్ట్ హైలైట్ కాబోతున్న చిత్రం రాకింగ్ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్'. 'కేజీఎఫ్ 2' తర్వాత సుదీర్ఘ విరామం తీసుకొని యశ్ వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక ఏపీ, తెలంగాణలో దిల్ రాజు ఈ చిత్రాన్ని ఆగస్టు 26న అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రవితేజ ‘ఇరుముడి’:

భారీ మాస్ కాన్సెప్ట్‌తో పాటు ఎమోషనల్ అండ్ డివోషనల్ టచ్ ఉన్న రవితేజ 'ఇరుముడి' సినిమాను కూడా అస్సలు మిస్ కాకూడదని సినీ ప్రియులు భావిస్తున్నారు. యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇక శర్వానంద్ 'భోగి' (ఆగస్టు 28) సహా పలు డబ్బింగ్ చిత్రాలు కూడా రేసులో ఉన్నాయి.

ఆగస్టు నెలలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నప్పటికీ.. గ్లోబల్ వైడ్‌గా భారీ అంచనాలున్న యష్ 'టాక్సిక్', భక్తి కాన్సెప్ట్‌తో వస్తున్న రవితేజ 'ఇరుముడి' చిత్రాలు మాత్రం ప్రతీ ఒక్కరూ చూడాల్సిన మస్ట్ వాచ్ సినిమాలు. మరి ఈ ఆగస్టు బాక్సాఫీస్ కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

Tags:    

Similar News