సీక్వెల్ మూవీ మరింత గ్రాండ్ గా.. ఒక్కసారిగా అంత బడ్జెట్ పెంచేశారేంటి?
తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ లెవెల్ లో పెరగడంతో ప్రతీ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.;
తెలుగు సినిమా స్థాయి గ్లోబల్ లెవెల్ లో పెరగడంతో ప్రతీ సినిమాను చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. దీంతో బడ్జెట్ బాగా ఎక్కువైపోతుంది. అందులోనూ ఏదైనా సినిమాకు సీక్వెల్ వస్తుంటే ఆ బడ్జెట్ ఇంకా ఎక్కువైపోతుంది. ఎప్పుడైనా సరే రోజులు పెరిగే కొద్దీ చిన్న సినిమాకైనా, పెద్ద సినిమాకైనా అయ్యే బడ్జెట్ కూడా పెరుగుతుంది.
ఈ నగరానికి ఏమైందికి సీక్వెల్
అదే మంచి క్రేజ్ ఉన్న సినిమాకు సీక్వెల్ గా వచ్చే ప్రాజెక్టు అయితే ఆ బడ్జెట్ పెరగడం కామన్. కానీ ఆ బడ్జెట్ మొదటి సినిమా కంటే భారీగా పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు విషయంలోకి వస్తే తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతునున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ నగరానికి ఏమైంది సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో పెర్ఫార్మ్ చేయలేదు.
రీరిలీజ్ కు భారీ కలెక్షన్లు
కానీ సినిమా తర్వాత ఓటీటీలోకి వచ్చాక మంచి ఆదరణ దక్కి, కల్ట్ స్టేటస్ ను తెచ్చుకుంది. మొన్నామధ్య సినిమాను రీరిలీజ్ చేస్తే రిలీజ్ టైమ్ లో వచ్చిన దాని కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఆ క్రేజ్ మొత్తాన్ని దృష్టిలో ఉంచుకునే నిర్మాతలు ఇప్పుడీ సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఈ సీక్వెల్ సినిమాకు మొదటి సినిమా బడ్జెట్ కంటే 15 రెట్లు బడ్జెట్ ఎక్కువ అవుతుందని రీసెంట్ గా నిర్మాత సృజన్ చెప్పారు.
15 రెట్లు ఎక్కువ బడ్జెట్ తో..
35 చిన్న కథ కాదు సినిమాతో నిర్మాతగా మంచి అభిరుచి ఉందని నిరూపించుకున్న సృజన్ ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది2 చేస్తున్నారు. మొదటి సినిమాలో నటించిన వారంతా ఈ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆఖరి దశ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాను మొదటి సినిమాకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని గ్రాండ్ గా నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ సీక్వెల్ మూవీ మొదటి సినిమా కంటే గొప్పగా ఉంటుందని, సినిమా తీయడం కోసం ఈఎన్ఈ గ్యాంగ్ పడే తిప్పల్ని ఈ మూవీలో నెక్ట్స్ లెవెల్ లో చూపించనున్నామని, సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని, అందుకే బడ్జెట్ భారీగా పెరిగిందని ఆయన చెప్పారు. అయితే ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అమ్మకం విషయంలో ఇబ్బందులు పడుతున్నట్టు సృజన్ తెలిపారు.