ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్స్‌లో గ్లామర్ vs సింప్లిసిటీ

ఉగాది కానుకగా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.;

Update: 2026-03-18 14:52 GMT

ఉగాది కానుకగా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్‌లో హీరోయిన్ల గ్లామర్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన శ్రీలీల, రాశీ ఖన్నా.. ఇద్దరూ తమదైన స్టైల్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

రీసెంట్ గా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రాశీ ఖన్నా తన గ్లామరస్ లుక్‌తో అందరి చూపును ఆకట్టుకుంది. డీప్ కట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఆమె హాట్ అప్పియ‌రెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే ఊపును కొనసాగిస్తూ తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో కూడా రాశీ తన స్టైలిష్ లుక్‌తో మళ్లీ ఆకట్టుకుంది. ఈసారి ఆమె వైట్ స్ట్రాప్‌లెస్ బ్లౌజ్‌తో సారీ ధరించి, క్లాస్‌తో కూడిన గ్లామర్‌ను ప్రదర్శించింది. ఈ లుక్‌లో ఆమె ప్రెజెన్స్ మొత్తం ఈవెంట్‌కు ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. రాశీ ఖన్నాకు గ్లామర్ కొత్తేమీ కాదు. ఆమె రీసెంట్ గా చేసిన స్పెషల్ సాంగ్ అచాచో దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. కానీ రాశీ గత చిత్రం తెలుసు కదా ప్రమోషన్స్‌లో ఆమె సింపుల్ అవతార్‌లో కనిపించడంతో, ఇప్పుడు మళ్లీ గ్లామర్ మోడ్‌లోకి రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇక మరోవైపు శ్రీలీల మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సారీతో పాటు ఫుల్ స్లీవ్ బ్లౌజ్‌లో కనిపించిన ఆమె, ప్రెస్ మీట్‌లో వైట్ చుడీదార్‌తో సింపుల్ లుక్‌ను కొనసాగించింది. మొన్నామ‌ధ్య ఆమె చేసిన కిస్సిక్ స్పెషల్ సాంగ్ కూడా భారీ హిట్ అయింది. అయినప్పటికీ, ఆన్-స్క్రీన్ గ్లామర్‌కు విరుద్ధంగా, ఆఫ్-స్క్రీన్‌లో ఆమె కొత్త‌ స్టైల్‌ను మెయింటైన్ చేయడం గమనార్హం.

ఈ రెండు భిన్నమైన స్టైల్స్ ఇప్పుడు ప్రేక్షకుల మధ్య చర్చకు దారితీస్తున్నాయి. కొందరు శ్రీలీలను అనుష్క లాంటి క్లాస్ మరియు సింప్లిసిటీ వైపు వెళ్తోందని అభిప్రాయపడుతుండగా, మరికొందరు రాశీ ఖన్నా తన గ్లామరస్ ప్రెజెన్స్‌తో ఈవెంట్స్‌ను మరింత హైప్ చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ కేవలం కంటెంట్ పరంగానే కాకుండా, స్టార్స్ స్టైలింగ్, ప్రెజెన్స్ వల్ల కూడా వార్తల్లో నిలుస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు నుంచే ఈ రేంజ్‌లో హైప్ రావడం, రిలీజ్ కు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ వచ్చే సూచనలుగా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News