శ్రీలీల‌, రాశీ ఖ‌న్నా గోత్ర, న‌క్ష‌త్రాలు చెప్పిన హ‌రీష్ శంక‌ర్

ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.;

Update: 2026-03-18 14:54 GMT

ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

రీసెంట్ గా చిత్ర బృందం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఈ సినిమా ప్రమోషన్స్‌కు మరింత హైప్ ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ట్రైలర్‌లో వినిపించిన “ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం” అనే పవర్‌ఫుల్ డైలాగ్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ డైలాగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

అయితే ఈ డైలాగ్‌కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. ట్రైల‌ర్ లో చెప్పిన గోత్రం, నక్షత్రం డైలాగ్ హరీష్ శంకర్‌కు బాగా సూటవుతాయని ప‌వ‌న్ చెప్పారు. కాగా తాజాగా జ‌రిగిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు దర్శకుడు హరీష్ శంకర్‌ను సినిమాకు సంబంధించిన హీరోయిన్లు, నిర్మాత‌ల గురించి గోత్రం, నక్షత్రం స్టైల్‌లో వివరించాలని కోరారు.

దానికి హరీష్ శంకర్ తనదైన స్టైల్‌లో సరదాగా స్పందిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. నిర్మాత నవీన్ యెర్నేని గురించి మాట్లాడుతూ బాగా ఖర్చు పెట్టే గోత్రం, కలెక్షన్లు రాబట్టే నక్షత్రం అని చెప్పి నవ్వులు పూయించారు. హీరోయిన్ రాశీ ఖన్నాది నవ్వించే గోత్రం, కవ్వించే నక్షత్రంగా వర్ణించగా, మరో హీరోయిన్ శ్రీలీల గురించి మొదట ముదురు గోత్రం, దేశముదురు నక్షత్రం అని చెప్పి, వెంటనే అందమైన గోత్రం, ఆహ్లాదమైన నక్షత్రం అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

అంతేకాదు, తన గురించి కూడా హరీష్ శంకర్ ఆసక్తికరంగా వ్యాఖ్యానిస్తూ త‌న‌ది శ్రమించే గోత్రం, సహించే నక్షత్ర‌మ‌ని చెప్పడం విశేషం. ఈ సరదా వ్యాఖ్యలు ప్రెస్ మీట్‌కు హైలైట్‌గా నిలవడంతో పాటు, చిత్ర బృందం మధ్య ఉన్న ఫన్ ఎలిమెంట్‌ను బయటపెట్టాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అభిమానులు ఈ కామెంట్స్‌ను విపరీతంగా షేర్ చేస్తూ, ట్రైలర్ డైలాగ్‌ను మరింతగా ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి, ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ ప్రమోషన్స్‌లో కొత్త కోణాన్ని తీసుకొచ్చి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News