నయన్ చేజారిన బిగ్ ఆఫర్, 10 ఏళ్లకు రిపీట్..!
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది.;
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఈమె నిలిచింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈమె అప్పుడప్పుడు హీరోలకు జోడీగా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. 2026 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఆ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నయనతార కెరీర్‌లో చాలా ఆఫర్లను కోల్పోవాల్సి వచ్చిందట.
2013లో షారుఖ్ ఖాన్‌తో కలిసి 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సమయంలో వ్యక్తిగత విషయాల కారణంగా నయనతార తీవ్రమైన ఒత్తిడిలో ఉంది. ఒకానొక సమయంలో నయనతార సినిమాలు మానేయాలని అనుకుంది. ఆ సమయంలో షారుఖ్ ఖాన్ మూవీ అయినప్పటికీ చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాకు నో చెప్పింది. నయనతార నో చెప్పడంతో దీపికా పదుకునే ఆ సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చాలా కాలం పాటు నయనతార చాలా దురదృష్టవంతురాలు, ఆ సినిమాను వదులుకోవడం అనేది ఆమె కెరీర్‌లో బిగ్ మిస్టేక్ అంటూ చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేశారు.
కట్ చేస్తే సరిగ్గా పదేళ్లకు అంటే 2023లో అదే షారుఖ్ ఖాన్‌తో జవాన్ సినిమాను చేసింది. జవాన్ సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నయనతార ఆ సమయంలో చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీని వదిలేయడం వల్లే పదేళ్లకు రిపీట్ అయ్యి జవాన్ ఆఫర్ దక్కింది. అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ సినిమాతో నయనతార బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాతో బాలీవుడ్‌లో నయనతార ఎంట్రీ ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండక పోయేది. అదే సమయంలో నయనతారకు కోలీవుడ్‌లో ఆఫర్లు తగ్గేవి. ఆ సమయంలో నయనతార ఆ ఆఫర్‌ను ఏ పరిస్థితుల వల్ల వదులుకున్నా మంచే జరిగిందని ఇప్పుడు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నయనతార ఇంకా కొన్ని సినిమాలను ప్రమోషన్స్‌కు హాజరు అయ్యేందుకు తిరష్కరించడం వల్ల చేజార్చుకుంది. ఆ సినిమాల్లో కొన్ని సూపర్ హిట్ కాగా కొన్ని నిరాశను మిగిల్చాయి. ఇక లేడీ ఓరియంటెడ్ కథలు కూడా కొన్ని నయనతార వద్దకు మొదట వెళ్లాయి. ఏవో కారణాల వల్ల నయనతార వాటిని సున్నితంగా తిరష్కరిస్తూ వచ్చింది. వాటిల్లోనూ కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. నటీ నటులు తమకు వచ్చిన అన్ని ఆఫర్లను చేయడం సాధ్యం కాదు. కానీ వారికి లక్ ఉంటే ఒక సమయంలో మిస్ అయిన ఛాన్స్ కచ్చితంగా మరో సమయంలో దక్కుతుంది.
అలా ఇండస్ట్రీలో చాలా మందికి లక్ కలిసి వచ్చి మిస్ అయిన ఆఫర్లు వచ్చాయి. అయితే నయనతారకు మాత్రం పదేళ్లకు ముందు మిస్ అయిన షారుఖ్ మూవీ ఆఫర్ పదేళ్ల తర్వాత దక్కింది. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఆమె లక్‌ను చూపిస్తుంది. పెళ్లి తర్వాత కూడా నయన్ చాలా బిజీగా సినిమాలు చేస్తుంది. ముందు ముందు ఆమె నుంచి మరిన్ని తెలుగు, తమిళ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.