విశ్వక్ నిజంగా మారాడా? లేక?

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2026-02-08 06:15 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన పేరు వినగానే గుర్తొచ్చేది నేచుర్ అండ్ స్టైల్. ఎందుకంటే స్టేజ్‌పై మైక్ పట్టుకున్నా, ఇంటర్వ్యూలో మాట్లాడినా.. మనసులో ఉన్నది ఓపెన్ గా చెప్పేయడం ఆయన స్టైల్. ఇది కొందరికి నచ్చితే.. మరికొందరికి మాత్రం యారోగెంట్ గా కనిపించింది.

కానీ విశ్వక్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. అయితే తాజాగా జరిగిన ఆయన అప్ కమింగ్ మూవీ ఫంకీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ లో ప్రొడ్యూసర్ నాగవంశీ చేసిన కామెంట్స్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విశ్వక్ మాటతీరుపై చర్చలు మొదలయ్యేలా చేశాయి. ఆ ఈవెంట్ లో నాగవంశీ మాట్లాడుతూ.. ఒకప్పుడు విశ్వక్ చాలా దూకుడుగా ఉండేవాడని, మైక్ ఇస్తే యారోగెంట్ గా బిహేవ్ చేసేవాడని అన్నారు.

కానీ ఇప్పుడు పూర్తిగా ఛేంజ్ అయ్యాడని, అనుదీప్‌ లా కూల్‌ గా, సరదాగా, నవ్విస్తూ కనిపిస్తున్నారని తెలిపారు. దీంతో ఆయన కామెంట్స్ ను కొందరు అభిమానులు సరదాగా తీసుకున్నా.. మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి విశ్వక్ సేన్ కెరీర్ మొదటి నుంచే తనదైన ధోరణితో ముందుకు సాగారని, ఇండస్ట్రీలో సూటిగా మాట్లాడే హీరోల్లో ఆయన ముందుంటారని అంటున్నారు.

ఎవరినీ మెప్పించాలనే ఉద్దేశంతో కాకుండా, తనకు అనిపించినదే చెప్పడం విశ్వక్ సేన్ స్వభావమని చెప్పాలి. ఇదే కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీలకు దారితీసింది. కానీ ఆ కాంట్రవర్సీల్లో చాలా వరకు విశ్వక్ తప్పు లేదని అభిమానులు, సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు. అంతే కాదు.. విశ్వక్ యారోగెంట్ కాదు, టోటల్ గా హోనెస్ట్ అని అంతా చెబుతుంటారు. నిజాయితీగా మాట్లాడటం వల్లే అపార్థాలు వచ్చాయేమోనని అంటుంటారు.

యాక్టర్ గా మాత్రమే కాకుండా నార్మల్ పర్సన్ గా స్టాండ్ క్లియర్‌ గా ఉండటం ఆయన స్పెషల్ అని, ఎవరికోసం తన క్యారెక్టర్ మార్చుకునే మనస్తత్వం విశ్వక్‌ ది అస్సలు కాదని అభిమానులు చెబుతున్నారు. అయితే విశ్వక్ ఇటీవల మాత్రం ప్రమోషన్లలో కూల్ గా, నవ్వుతో సరదాగా కనిపిస్తున్నారు. దీనిని కొందరు ఛేంజ్ వచ్చిందని భావిస్తుంటే.. మరికొందరు మెచ్యూరిటీగా చూస్తున్నారు.

ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వచ్చే నేచురల్ ఛేంజ్ అదని అనేక మంది అభిప్రాయం. యాటిట్యూడ్ మారకపోయినా, ప్రెజెంటేషన్‌ లో కాస్త సాఫ్ట్‌నెస్ రావడం సహజమేనని అంటున్నారు. అయితే నాగవంశీ కూడా ఇండస్ట్రీలో సూటిగా మాట్లాడే నిర్మాతగా పేరుంది. కాంట్రవర్సీలు ఎదురైనా పాజిటివ్‌గా ముందుకు వెళ్లే క్యారెక్టర్ ఆయనది. అందుకే నాగవంశీ, విశ్వక్ ఇద్దరిలోనూ సేమ్ క్లారిటీ ఉంటుందని అంంటున్నారు.

కానీ విశ్వక్ మారిపోయాడని నాగవంశీ చేసిన కామెంట్ కొందరు అభిమానులకు నచ్చనట్లు కనిపిస్తోంది. మొత్తానికి, విశ్వక్ సేన్‌ లో ఛేంజ్ వచ్చిందనేకంటే మెచ్యూరిటీ అని చెబుతున్నారు. నిజాయితీ, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే క్యారెక్టర్ మాత్రం ఎప్పటికీ ఉంటుంది. అదే ఆయనను ఫ్యాన్స్ కు, సినీ ప్రియులకు దగ్గర చేస్తోంది. అయితే నాగవంశీ కామెంట్స్ పై వీరిద్దరిలో ఎవరైనా రెస్పాండ్ అవుతారో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ఒక విషయం మాత్రం నిజం.. విశ్వక్ హోనెస్ట్ పర్సన్ అని నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు చెబుతున్నారు.




Tags:    

Similar News