మిరాయ్.. ఎంత పెట్టినా లాభమే!

రీసెంట్ గా హనుమాన్ చిత్రంతో భారీ విజయం అందుకుని రికార్డులు సృష్టించారు తేజ.

Update: 2024-05-07 09:22 GMT

తేజ సజ్జా పేరు టాలీవుడ్ లో ఈ మధ్య బాగా వినిపిస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ యంగ్ హీరో.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. దాదాపు తెలుగులో అందరు స్టార్ హీరోల చిత్రాలలో బాలనటుడిగా యాక్ట్ చేసి మెప్పించాడు. ఇప్పుడు హీరోగా మారి వరుస సినిమాలు చేస్తున్నాడు. సమంత 'ఓ బేబీ' మూవీలో నటించి మెప్పించిన తేజ.. హీరోగా ఫస్ట్ మూవీ జాంబిరెడ్డితో హిట్ అందుకున్నారు.


రీసెంట్ గా హనుమాన్ చిత్రంతో భారీ విజయం అందుకుని రికార్డులు సృష్టించారు తేజ. త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ మూవీ మిరాయ్ తో రానున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన.. సూర్య వర్సెస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ మూవీస్ తో తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నారు. ఇప్పుడు తేజను కూడా కొత్తగా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. మిరాయ్ మూవీలో యోధుడిగా తేజ కనిపించనున్నారు.

అయితే అనుకున్నదానికంటే మిరాయ్ మూవీ బడ్జెట్ బాగా పెరిగిపోయిందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం కోసం మొదట్లో రూ.30 కోట్ల బడ్జెట్ అనుకున్నారని, తర్వాత బడ్జెట్ రూ.40 కోట్లుగా మారిందని టాక్ వినిపించింది. హనుమాన్ సక్సెస్ తర్వాత మేకర్స్.. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశారని, అందుకే బడ్జెట్ పెరిగిందని గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ కు సంబంధించి మరో వార్త బయటకొచ్చింది.

మిరాయ్ సినిమాకు గాను పెరిగిన బడ్జెట్.. మేకింగ్ కోసం కాదని టాక్ వినిపిస్తోంది. తేజ సజ్జా రెమ్యునరేషన్ పెంచడం వల్లే ఈ సినిమా బడ్జెట్ పెరిగిందని సమాచారం. దాని బట్టి చూస్తే.. హనుమాన్ సక్సెస్ తర్వాత తేజ పారితోషికం బాగానే పెంచారన్నమాట. తెలుగుతో పాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18వ తేదీన మిరాయ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ మూవీ కోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పెట్టినా.. బిజినెస్ విషయంలో ఎలాంటి ఢోకా అవసరం లేదని సినీ పండితులు అభిప్రాయ పడుతున్నారు. తేజకు హనుమాన్ మూవీతో వచ్చిన క్రేజ్, టైటిల్ గ్లింప్స్ తో ఏర్పడిన అంచనాలతో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వాటితోనే పెట్టుబడి అంత వచ్చేస్తుందని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News