• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  QR కోడ్ స్కాన్ చేస్తే...

QR కోడ్ స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ రివీల్.. ఇదేదో కొత్తగా ఉందే..

By - Tupaki Desk
Update: 2024-03-12 06:06 GMT

దిగ్గజ నటుడు, నట విరాట్ రావు గోపాలరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రావు రమేశ్ .. మంచి పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే. తన నటనతో ఇండస్ట్రీలో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రశంసలు అందుకుంటున్నారు. తండ్రిలాగే తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. సినిమాల సెలక్షన్ లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ఆయన నటించిన సినిమాల ఫలితం ఎలా ఉన్నా రావు రమేశ్.. పోషించిన పాత్రలు మాత్రం ఎప్పుడూ హిట్ అవుతూనే ఉంటాయి. అటువంటి నటుడు ఇప్పుడు లీడ్ రోల్ లో మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.

తాజాగా మేకర్స్ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. అందులో ఒక క్యూఆర్ కోడ్ ను యాడ్ చేశారు. దానిని స్కాన్ చేస్తే ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూడొచ్చని తెలిపారు. క్యూఆర్ కోడ్‌ ను స్కాన్ చేయడం ద్వారా కనీసం 50,000 మంది ఈ పోస్టర్‌ ను విడుదల చేస్తారని అంచనా వేశారు. ఎంతమందైనా స్కాన్ చేసి చూడొచ్చని చెప్పారు. అయితే ఫస్ట్ లుక్ తెగ ఆకట్టుకుంటోంది. లుంగీ అవతార్ లో ఉన్న రావు రమేశ్.. మంచి ఎంటర్టైన్మెంట్ అందించనున్నట్లు అర్థమవుతోంది. పోస్టర్ ను క్యూఆర్ కోడ్ ద్వారా రిలీజ్ చేయడం కొత్తగా ఉంది.

"మారుతీ నగర్ సుబ్రమణ్యం.. భలే గమ్మత్తుగా ఉంటోంది. ఈ సినిమా పోస్టర్ ను నటుడిగా నాకు ఈ స్థాయిని, స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బాగుంటుందని నమ్మాం. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి పోస్టర్ ను ఆవిష్కరించండి. ప్రోత్సహించండి" అని రావు రమేశ్ వీడియోలో తెలిపారు. అయితే ఈ సినిమా అంతా రావు రమేశ్ రోల్ చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం చెప్పడానికే టైటిల్ పోస్టర్ విడుదలకు రావు రమేశ్ గతంలో చేసిన రెండు పాత్రలను గెస్ట్ లుగా స్పెషల్ గా తీసుకువచ్చారు మేకర్స్!

మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమాకు హ్యాపీ వెడ్డింగ్ ఫేమ్ లక్షణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, సినిమాటిక్స్ బ్యానర్లపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య సంయుక్తంగా నిర్మించారు. సీనియర్ నటి ఇంద్రజ.. రావు రమేశ్ కు జోడీగా నటిస్తున్నారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.

Full View
Tags:    
  • Raoramesh 
  • Maruthinagarsubramanyam 
  • Maruthinagarsubramanyammovie 
  • Tollywood 
  • Movieews 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS