ఈటీవీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌.... ఇది హిట్‌ కాదు!!

2025 సంవత్సరం పూర్తి కావస్తుంది, ఈ ఏడాదిలో భారీ బడ్జెట్‌ సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు, లో బడ్జెట్‌/చిన్న సినిమాలు చాలానే వచ్చాయి.;

Update: 2025-12-24 08:30 GMT

2025 సంవత్సరం పూర్తి కావస్తుంది, ఈ ఏడాదిలో భారీ బడ్జెట్‌ సినిమాలు, మీడియం రేంజ్ సినిమాలు, లో బడ్జెట్‌/చిన్న సినిమాలు చాలానే వచ్చాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈసారి చిన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా లిటిల్‌ హార్ట్స్ వంటి చిన్న సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌ పెద్ద ఫిల్మ్‌ మేకర్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన లిటిల్‌ హార్ట్స్‌ సినిమా ఏకంగా తెలుగు బాక్సాఫీస్ వద్ద రూ.35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. చిన్న సినిమాల్లో బాహుబలి రేంజ్ విజయం అంటూ చాలా మంది బాక్సాఫీస్ వర్గాల వారు ఈ సినిమా కలెక్షన్స్ ను విశ్లేషించిన సమయంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఈటీవీ విన్‌ ద్వారా తెలుగు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకుంది.

లిటిల్‌ హార్ట్స్‌ సినిమాతో...

థియేటర్‌లలో హిట్‌ అయిన లిటిల్‌ హార్ట్స్‌కి అనుకున్నట్లుగానే ఓటీటీ ద్వారా మంచి రెస్పాన్స్ దక్కింది. థియేటర్‌లో ఉన్న సమయంలోనే ఓటీటీలో వచ్చింది. మూడు నాలుగు వారాల పాటు సాలిడ్‌ కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా కొన్ని పెద్ద సినిమాలను కూడా వెనక్కి నెట్టి మరీ ఆ వారంలో సాలిడ్‌ కలెక్షన్స్ రాబట్టి సర్‌ప్రైజ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయాన్ని గ్రేట్‌ అంటూ ఉంటే, ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌ అయ్యి అత్యధికులు చూసిన సినిమాగా నిలిచింది. అక్కడ, ఇక్కడ హిట్‌ ను సొంతం చేసుకున్న లిటిల్‌ హార్ట్స్ మరో విజయాన్ని సొంతం చేసుకోవడంతో వార్తల్లో నిలిచింది. ఈటీవీ విన్‌ కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం, అందుకే ఈ సినిమాను ఇతర భాషల ప్రేక్షకులకు ఓటీటీ ద్వారా చూపించే అవకాశం లేదు అని ఫీల్‌ అవుతున్న సమయంలో నెట్‌ఫ్లిక్స్ నుంచి సాలిడ్‌ ఆఫర్ దక్కిందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ వారు ఈ సినిమా ఇతర భాషల స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకుంది.

నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న లిటిల్‌ హార్ట్స్‌

నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మధ్య కాలంలో స్ట్రీమింగ్‌ అయిన చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో పోల్చితే లిటిల్‌ హార్ట్స్ సినిమా ఓ రేంజ్‌ లో హిట్‌ టాక్‌ తో ఇతర భాషల ప్రేక్షకుల ఆధరణ దక్కించుకుని దూసుకు పోతుంది. కాస్త ఆలస్యంగా ఇప్పుడు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలాంటి చిన్న సినిమాలకు, లో బడ్జెట్‌ సినిమాలకు ఇతర భాషల నుంచి పెద్దగా స్పందన ఉండదు. కానీ ఈ సినిమా విషయంలో అది రివర్స్ అయింది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమాను అత్యధిక పర భాష ప్రేక్షకులు చూస్తున్నారు. ముఖ్యంగా తమిళ్‌ ప్రేక్షకులు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ లో తమిళ భాషలో చూసి తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. అదే టైటిల్‌ తో తమిళ్‌ తో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తమిళ ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చించుకుంటూ తెగ హడావిడి చేస్తున్నారు.

ఇతర భాషల్లో సూపర్‌ హిట్‌ టాక్‌

ఈటీవీ విన్‌ ద్వారా కాకుండా ఇతర ఓటీటీ ద్వారా వచ్చి ఉంటే తెలుగులో మరింతగా ఈ సినిమా వ్యూస్‌ ను దక్కించుకునే అవకాశం ఉండేది అని కొందరు కామెంట్స్ చేశారు. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ లో సినిమా ఇతర భాషలో ఉన్నప్పటికీ చాలా మంది తెలుగు ప్రేక్షకులు మళ్లీ అక్కడ కూడా చూస్తున్నారు. ఇప్పటికే చూసిన వారు చాలా మంది రిపీట్‌ ఆడియన్స్‌గా మారుతున్నారు. ఓటీటీలో ఈ మధ్య కాలంలో ఇలాంటి చిన్న కంటెంట్‌ మూవీ ఈ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవడం చూడలేదు అంటూ ఓటీటీ విశ్లేషకులు అంటున్నారు.

లిటిల్‌ హార్ట్స్‌ వంటి చిన్న కామెడీ సినిమాకు ఇతర భాషల్లో దక్కుతున్న ఆధరణ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ సినిమా అక్కడ థియేట్రికల్‌ మిస్ అయ్యిందని, అక్కడ కూడా థియేట్రికల్‌ రిలీజ్‌ అయ్యి ఉంటే తప్పకుండా భారీ వసూళ్లు నమోదు అయ్యేవి అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి ఈ ఏడాదిలో నమోదు అయిన హిట్స్ లో ఇది ముందు ఉంటుంది.

ఈ సినిమా సాధించింది హిట్ అని కాకుండా ఇంకా పెద్ద పేరు ఏమైనా పెట్టాలంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం రెండున్నర కోట్ల రూపాయల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా సాధించిన ఈ విజయం రాబోయే పదేళ్ల వరకు గుర్తుండి పోతుంది అనడంలో సందేహం లేదు. కేవలం ఒక్క భాష డబ్బింగ్‌ వర్షన్‌తో సినిమా బడ్జెట్‌ వచ్చి ఉంటుంది అనేది విశ్లేషకుల మాట. ఈటీవీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వరకు వెళ్లిన లిటిల్‌ హార్ట్స్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డ్‌లు నమోదు చేసినా ఆశ్చర్యం లేదు.

Tags:    

Similar News