• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కోట బొమ్మాళి ఒక గ్రేట్...

కోట బొమ్మాళి ఒక గ్రేట్ ఎక్స్ పీరియన్స్..!

| ఈ ప్రాజెక్టులో ఎలా భాగమయ్యారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆర్టికల్ 15 తమిళ్ రీమేక్ లో తన నటన చూసి తేజ ఈ కథతో వచ్చారు.

By - Tupaki Desk
Update: 2023-11-15 13:09 GMT

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించిన సినిమా కోట బొమ్మాళి పీఎస్‌. జోహార్, అర్జున ఫల్గుణ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ సినిమా నిర్మించారు. నవంబర్ 24న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శివాని రాజశేఖర్ మీడియాతో ముచ్చటించారు.

ఈ ప్రాజెక్టులో ఎలా భాగమయ్యారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఆర్టికల్ 15 తమిళ్ రీమేక్ లో తన నటన చూసి తేజ ఈ కథతో వచ్చారు. ఆ సినిమాలో ట్రైబల్ అమ్మాయిగా చేశాను ఇందులోనూ అలాంటి తరహా పాత్ర కావడంతో తనను సంప్రదించారు. నాయట్టు చిత్రానికి రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్నో మార్పులు చేశారు. షూటింగ్ చేస్తున్నప్పుడే సినిమాపై కాన్ఫిడెన్స్ వచ్చిందని.. ఈ సినిమా కోసం శ్రీకాకుళం సాంగ్ కూడా నేర్చుకున్నానని అన్నారు.

ఒరిజినల్ వెర్షన్ నాయట్టు చూశారా అంటే.. ఈ ఆఫర్ రాగానే ఒరిజినల్ వెర్షన్ చూశాను. విలేజ్ లో కనిపించే లేడీ కానిస్టేబుల్ పాత్రలో నటించానని అన్నారు. నాన్న చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా నటించారు.. తాత గారు పోలీసే అందుకే వారి నుంచి తెలియకుండానే చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు. ఈ సినిమా విషయంలో నా గెటప్ కోసం నాన్న గారు సలహాలు ఇచ్చారని అన్నారు.

లింగిడి లింగిడి సాంగ్ రెస్పాన్స్ ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించగా.. ఆ పాట వైరల్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఆర్టిస్ట్ కి తన సినిమా బాగుండాలి.. సినిమాలోని పాటలు సక్సెస్ అవ్వాలని కోరిక అందరికి ఉంటుంది. ఈ పాటతో ఆ హ్యాపీనెస్ వచ్చింది. ఈ సాంగ్ వల్ల నాకు మరింత గుర్తింపు వచ్చింది. ఎక్కడికి వెళ్లినా ఈ పాట గురించి మాట్లాడుతున్నారు. లింగిడి పాట వల్లే కోట బొమ్మాళి సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఇంతలా ఈ పాటను జనాల్లోకి తీసుకెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ కి స్పెషల్ థాంక్స్ అని అన్నారు.

ఒరిజినల్ వెర్షన్ లోని పాత్ర మీపై ఎలా ప్రభావితం చేసింది అని అడిగితే.. ఒరిజినల్ క్యారెక్టర్స్ తో నేను ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వను. సినిమాగా చూసి వదిలేస్తాను అంతే తప్ప వారిని ఫాలో అవ్వను ఎందుకంటే.. ఇమిటేషన్ ఉండకూడదని అనుకుంటా. ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుంది. ఒరిజినల్ చూసినవారు కూడా ఈ సినిమాను ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. అలా అని ఒరిజినల్ సోల్ కు ఏ మాత్రం తక్కువ ఉండదని అన్నారు.

రీమేక్ అంటే ఛాలెంజింగ్ ఉంటుంది.. కంపేరిజన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశ్నించగా.. ఈ చిత్రాన్ని మా టీమ్ అంతా ముందు నుంచి రీమేక్ అని నమ్మలేదు. ఆ పాయింట్ తప్ప మిగతా సినిమా అంతా మార్పులు చేశారని అన్నారు.

ఈ సినిమా మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నారనగా.. ఆలు తాను దాని గురించి ఏమీ ఆలోచించలేదు. ఎంత ఆలోచించినా జరగాల్సిందే జరుగుతుందనే విషయం నాకు బాగా అర్థమైంది. చిన్నప్పటి నుంచి అమ్మానాన్నను చూసి పెరగడం కూడా మాకు ఒక లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అని అన్నారు. మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్ చేయడమే అని నమ్ముతాం. నచ్చింది చేసుకుంటూ పోవడాన్ని నమ్ముతాను రిజల్ట్, సక్సెస్ వాటంతట అవే వస్తాయి. గ్లామర్ రోల్స్ కమర్షియల్ రోల్స్ కూడా చేయాలని ఉంది. వాటి కోసం వెయిట్ చేస్తున్నానని అన్నారు.

కొత్త కథలు వచ్చినప్పుడు అమ్మానాన్నల సలహాలు తీసుకుంటారా అని ప్రశ్న రాగా.. నా కథల విషయంలో గానీ శివాత్మిక కథల విషయంలో గానీ వాళ్లు జోక్యం చేసుకోరు. మా పై వారికి నమ్మకం ఉంది. వాళ్ళు ఎప్పుడూ మా కథలు వినలేదు. చివరి నిర్ణయం మాకే వదిలేస్తారని అన్నారు.

శ్రీకాంత్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఏంటని ప్రశ్నకు సమాధానంగా.. శ్రీకాంత్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ గా.. డాడీ కి కొలీగ్ మాకు తెలుసు. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఆయన చాలా జోవియల్ యాక్టర్. సెట్లో చాలా సరదాగా ఉంటారు. ఆయన దగ్గర నుంచి నేను, రాహుల్ చాలా విషయాలు నేర్చుకున్నాం. దర్శకుడికి గౌరవం ఇవ్వడం.. టైంకి సెట్ కి రావడం లాంటివి ఎన్నో విషయాలు ఆయన్ను చూసి నేర్చుకున్నాం. వరలక్ష్మి శరత్ కుమార్ గారి పాత్ర హైలెట్ గా ఉంటుందని అన్నారు శివాని రాజశేఖర్.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Shivanirajashekar 
  • Kotabommalips 
  • Movie 
  • Srikanth 
  • Media 
  • Coprole 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS