'దేవర 2' బిగ్ అప్టేడ్ !
ఈనెల 20 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. పాన్ ఇండియాలో అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్లు ప్లాన్ చేస్తున్నారు.;
ఈనెల 20 న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. పాన్ ఇండియాలో అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేషన్లు ప్లాన్ చేస్తున్నారు. ఓ పెద్ద పండగలా ఆ రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవు తున్నారు. ప్రతిగా ఆ రోజు `వార్ -2` సహా `డ్రాగన్` కి సంబంధించిన అప్ డేట్స్ తోనూ తారక్ ఖుషీ చేసే అవకాశం ఉంది. రెండు ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలు కాబట్టి ఇలాంటి స్పెషల్ ప్లానింగ్ తప్పని సరి.
చిత్ర హీరోకు ఆ రకంగా విషెస్ చెప్పడం చాలా కాలంగా ఆచరణలో ఉంది. కానీ కొరటాల మాత్రం మ్యూట్ లో ఉన్నా? కానీ ఆ రోజు ఆయన కూడా బిగ్ అప్ డేట్ ఇవ్వబోతున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. `దేవర 2` చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించబోతున్నారుట. అది స్టోరీకి సంబంధిం చిన అప్ డేట్ అయి ఉండొచ్చని తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `దేవర` డివైడ్ టాక్ తో ఆడింది.
అయినా పాన్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దూకుడు ఎక్కడా తగ్గలేదు. రివ్యూలు నెగిటివ్ గా వచ్చినా? ఆ ప్రభావం పెద్దగా పడలేదు. అయితే తారక్ `దేవర2` ని పక్కనబెట్టి కొత్త చిత్రాలు తెరపైకి తేవడంతో `దేవర 2` లేనట్లేనని ప్రచారం బలంగా జరిగింది. బాక్సాఫీస్ లెక్కలన్నీ తప్పులు తడక కాబట్టే తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని తారక్ ఖండించాడు.
`దేవర 2` కచ్చితంగా ఉటుందని...తామే కావాలని కొంత గ్యాప్ తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో క్లారిటీ వచ్చింది. కంటున్యూగా కొరటాల కూడా రెండవ భాగం మరింత బలంగా ఉంటుందని స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇదంతా జరిగి కొన్ని నెలలవుతుంది. `దేవర` రిలీజ్ నుంచి కొరటాల రెండవ భాగం స్టోరీ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టోరీకి సబంబంధించి ఓ కొలిక్కి రావడంతో తారక్ బర్త్ డేకి అప్డేట్ ఇచ్చే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.