శోభన్ బాబు మాట వినలేదు...సీనియర్ నటుడు ఆవేదన

సీనియర్ నటుడు ఒకనాటి హీరో అర్జున్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే సినిమాలు ఎన్నో ఉన్నాయి.;

Update: 2026-02-07 07:30 GMT

తెలుగు సినీ పరిశ్రమలో శోభన్ బాబు ఒక ప్రముఖ హీరోగా మాత్రమే కాదు ఒక మంది శ్రేయోభిలాషిగా అందరితోనూ ఉండేవారు, ముఖ్యంగా షూటింగ్ సమయంలో తన సహ నటులకు ఆయన ఎంతో విలువైన సూచనలు ఇచ్చేవారు. సినీ రంగం అస్థిరమైనది, ఈ రోజు వచ్చిన అవకాశాలు రేపటికి రావు, ఎపుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, అందువల్ల ఉన్న రోజే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని ఆ డబ్బులను ఎప్పటికీ పెరిగే ఆస్తి గా ఉండే భూముల మీద పెట్టాలని శోభన్ బాబు సలహాలు ఇస్తూండేవారు. ఆయన ఇచ్చిన సలహాలు పాటించి తమ జీవితంలో ఎంతో బాగా ఎదిగిన వారు ఉన్నారు. అయితే ఒక సీనియర్ నటుడు నిన్నటి తరం హీరో మాత్రం తాను శోభన్ బాబు ఇచ్చిన సూచనలు పాటించలేకపోయాను అని అందుకే తన ఆస్తులు పెంచుకోలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

సుదీర్ఘ కెరీర్ లో :

సీనియర్ నటుడు ఒకనాటి హీరో అర్జున్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే సినిమాలు ఎన్నో ఉన్నాయి. మా పల్లెలో గోపాలుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఆయన టాలీవుడ్ లో దూసుకుని వచ్చారు ప్రతిధ్వని వంటి సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించారు. అదే విధంగా 80 దశకంలో టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా వెలుగు వెలిగారు. తాజాగా అర్జున్ తన కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేస్తూ సీతా పయనం అన్న మూవీని ఆయన సొంత దర్శకత్వంలో నిర్మించారు ఈ మూవీ ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆయన సినిమా విశేషాలతో పాటు తన 46 ఏళ్ళ సినీ కెరీర్ గురించి కూడా ఎన్నో విషయాలను చెప్పడం విశేషం.

ఒకే ఒక్క సినిమా కానీ :

ఇక అర్జున్ శోభన్ బాబుతో కలసి ఒకే ఒక్క సినిమాలో నటించారు. ఈ సినిమాతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం పెరిగింది అని ఆయన చెప్పారు. షూటింగ్ గ్యాప్ లో శోభన్ బాబు తనతో ఎన్నో విషయాలు చెప్పేవారు అని అర్జున్ గుర్తు చేసుకున్నారు. ఉన్న డబ్బుని పెట్టుబడిగా పెట్టమని శోభన్ బాబు చెప్పేవారు అని చిన్న వయసు కావడం వల్ల తనకు అది పెద్దగా తెలిసేది కాదని అర్జున్ అన్నారు. ఆ తరువాత తనకు వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టాలో ఏమి చేయాలో తెలియక తాను చాలా నష్టపోయాను అన్నారు, తనను ఎందరో మోసం చేశారు అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే శోభన్ బాబు మాట విని ఉంటే తన ఆస్తులు ఒక స్థాయిలో ఉండేవని అర్జున్ చెప్పడం విశేషం.

పాజిటివ్ గా ఉంటా :

అయితే తాను ఇపుడు ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకున్నాను అని ఆ సీనియర్ నటుడు చెప్పారు. తాను పాజిటివ్ గా థింక్ చేస్తాను అని కేవలం ఇంటి నుంచి వచ్చే భోజనం చేస్తూ ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ తన ఫిట్ నెస్ ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను అని ఆయన చెప్పారు. ఏది ఏమైనా అర్జున్ చెప్పిన విషయాలు చూస్తే శోభన్ బాబు ఒక మార్గదర్శకుడిగా ఉంటూ ఎంతో మంది జీవితాలను చక్కదిద్దారు అని అర్థం అవుతోంది. విన్న వాళ్ళు అంతా బాగుపడ్డారు, వినని వారు ఇబ్బందులు పడ్డారు అని కూడా బోధ పడుతోంది.

Tags:    

Similar News