కయాదు లోహర్ న్యూ లుక్ వైరల్.. సారీలో రాయల్ వైబ్!

దేవకన్యలా మెరిసిపోతూ రాయల్ వైబ్స్‌తో ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ప్రమోషన్ల హడావుడి మధ్య పంచుకున్న ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్ మనసులను కొల్లగొడుతున్నాయి.

Update: 2026-09-19 17:55 GMT

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాతో పాన్-ఇండియా రేంజ్‌లో అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ భామ తాజాగా పోస్ట్ చేసిన ఇండో-వెస్ట్రన్ సారీ లుక్ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. దేవకన్యలా మెరిసిపోతూ రాయల్ వైబ్స్‌తో ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ప్రమోషన్ల హడావుడి మధ్య పంచుకున్న ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతూ ఫ్యాన్స్ మనసులను కొల్లగొడుతున్నాయి.



 


రుక్మిణి అటెలియర్ అవుట్‌ఫిట్‌లో రాయల్ వైబ్:

తాజా ఫోటోషూట్ కోసం కయాదు లోహర్ 'రుక్మిణి అటెలియర్' బ్రాండ్‌కు చెందిన కస్టమ్ ఐవరీ డ్రేప్డ్ ఇండో-వెస్ట్రన్ ఎన్‌సెంబుల్‌ను ఎంచుకుంది. డీప్ వి-నెక్ క్రాప్ టాప్, మల్టీ-వే వ్రాప్డ్ చిఫ్ఫాన్ డ్రేప్స్, దానికి మ్యాచింగ్‌గా ఉన్న ఫ్లోవీ షీర్ డ్రెస్‌లో ఆమె ఎంతో క్యూట్‌గా మెరిసిపోయింది. ఇక బెలూన్ స్లీవ్స్, కట్ వర్క్ డిజైన్, హై-వేస్టెడ్ ఫిట్టెడ్ స్కర్ట్ కలబోతగా ఉన్న ఈ అవుట్‌ఫిట్ ఆమెకు రాయల్ ఐవరీ లుక్‌ను తెచ్చిపెట్టింది.



 


'ఫెయిరీ బిజినెస్' అంటూ డ్రీమీ క్యాప్షన్ :

స్టైలిస్ట్ ఇనాజ్ ఫర్హాన్ డిజైన్ చేసిన ఈ లుక్‌కు జతగా 'పర్పుల్ తులిప్' పెర్ల్ డ్రాప్ జ్యువెలరీ, హెయిర్ స్టైలిస్ట్ ఆదిత్య జయకుమార్ వేసిన వేవీ హెయిర్, ధీరజ మేకప్ జతచేసి మెరిసిపోయింది. "మీ ఫీడ్‌కి కాస్త దేవకన్యల మ్యాజిక్ ఇస్తున్నా " అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ పిక్స్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు "గార్జియస్", "ఫెయిరీ టేల్ వైబ్స్ ఓన్లీ", "ప్యూర్‌ బ్యూటీ" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.



 


'డ్రాగన్' హిట్ నుంచి నేటివరకు కెరీర్:

ఇటీవల ప్రదీప్ రంగనాథన్ సరసన 'డ్రాగన్' సినిమాలో పల్లవి పాత్రలో నటించి సౌత్‌లో క్రేజ్ సంపాదించుకుంది కయాడు. ఆ తర్వాత 'ఇదయం మురళి', 'ఇమ్మోర్టల్' వంటి వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రతి సినిమాలో తనదైన నటనతో అలరిస్తూ సౌత్ ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.



 


'ది ప్యారడైజ్' అండ్ చేతిలో క్రేజీ ఆఫర్లు:

ప్రస్తుతం నాని సరసన పాన్ ఇండియా మూవీ 'ది ప్యారడైజ్'లో నటిస్తోంది. దీనితో పాటు మలయాళంలో తోవినో థామస్‌తో 'పల్లిచట్టంబి', దుల్కర్ సల్మాన్‌తో 'ఐమ్ గేమ్', అలాగే సూర్య 48 చిత్రాలతో పాటు 'ఫంకీ' సినిమాలో నటిస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. తన అద్భుతమైన గ్లామర్ అండ్ క్యూట్ లుక్స్‌తో ట్రెండ్ సెట్ చేస్తున్న కయాదు లోహర్, 'ది ప్యారడైజ్' చిత్రంతో పాన్-ఇండియా స్థాయిలో మరింత పెద్ద విజయాన్ని సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News