లాభమే కాదు.. రిస్క్ కూడా.. తెలుగు హీరోల కొత్త ప్లాన్!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'కేఏ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి 'హతః' అనే సైకలాజికల్ హారర్ మిస్టరీ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక కొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మన యంగ్ హీరోలు కేవలం మేకప్ వేసుకుని కెమెరా ముందు నటించడానికే పరిమితం కావడం లేదు. తమకు నచ్చిన కథలను స్వేచ్ఛగా తెరకెక్కించడం, బడ్జెట్‌పై పట్టు సాధించడం కోసం నిర్మాణంతో పాటు కథ, దర్శకత్వం బాధ్యతలను కూడా భుజాన వేసుకుంటున్నారు. కొందరు సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌లు పెట్టి సినిమాలు తీస్తుంటే, మరికొందరు మెగాఫోన్ పట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ హీరోల వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
నాని ప్రయోగాత్మక నిర్మాణాలు:
నేచురల్ స్టార్ నాని 'వాల్ పోస్టర్ సినిమా' అనే బ్యానర్‌ను స్థాపించి, యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన సినిమాలు నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణంలో వచ్చిన 'అ!', 'హిట్' సిరీస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. స్వయంగా నటిస్తూనే, మరోవైపు నిర్మాతగా కొత్త కథలకు ప్రాణం పోస్తూ నాని టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
విశ్వక్ సేన్ మల్టీ-టాస్కింగ్:
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన సినిమాలకు నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను కూడా చూసుకుంటారు. గతంలో 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా దమ్కీ' సినిమాలను తన సొంత బ్యానర్‌లో నిర్మించి, దర్శకత్వం వహించిన ఆయన, ఇప్పుడు ఇక తన సొంత దర్శకత్వంలో 'కల్ట్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
మెగాఫోన్ పడుతున్న రామ్, కార్తికేయ:
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ సినిమా కు స్వయంగా కథ అందిస్తూ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్నారు. 'రాపో సినిమాటిక్స్' బ్యానర్‌పై కృష్ణ పోతినేని దీనిని నిర్మిస్తున్నారు. ఇక మరోవైపు 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ కూడా తన సొంత బ్యానర్‌లో నిర్మించే సినిమాకు స్వయంగా దర్శకత్వం వహించబోతుండటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
కిరణ్ అబ్బవరం సైకలాజికల్ థ్రిల్లర్:
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'కేఏ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి 'హతః' అనే సైకలాజికల్ హారర్ మిస్టరీ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక అనుష్ గోరక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్‌లో విడుదలకానుంది. తన మార్కెట్‌కు తగ్గట్లు బడ్జెట్‌ను ప్లాన్ చేసుకుంటూ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ కొత్త ప్లాన్ వల్ల లాభాలు ఏంటి?:
హీరోలు నిర్మాతలుగా, దర్శకులుగా మారడం వల్ల కథల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. రొటీన్ ఫార్ములా పక్కనపెట్టి కొత్త ప్రయోగాలు చేయవచ్చు. అలాగే భారీ రెమ్యునరేషన్ తీసుకోకుండా బిజినెస్ లాభాల్లో వాటా తీసుకోవడం వల్ల బయటి నిర్మాతలపై భారం తగ్గుతుంది. అంతేకాకుండా ఇక పరిశ్రమకు కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు పరిచయం అవుతారు.
సొంతంగా సినిమాలు తీయడం వల్ల క్రియేటివ్ ఫ్రీడమ్, లాభాలు ఎంతగా లభిస్తాయో... కథ క్లిక్ కాకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఇక ఏది ఏమైనా, రిస్క్ అయినా సరే సొంతంగా అడుగులు వేస్తూ టాలీవుడ్‌కు కొత్త ఊపిరి తెస్తున్న యంగ్ హీరోల ధైర్యాన్ని అభినందించాల్సిందే..