గాడ్ ఆఫ్ వార్ కన్ ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ..?

ఐతే మధ్యలో ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతి నుంచి ఎన్టీఆర్ కి షిఫ్ట్ అయ్యింది. ఎన్టీఆర్ కూడా మురుగన్ బుక్ ని చేతిలో పట్టుకుని కనిపించిన సందర్భాలు ఉన్నాయి.;

Update: 2026-02-07 07:57 GMT

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే మైథాలజీ మూవీ గాడ్ ఆఫ్ వార్ పై రోజుకొక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. గాడ్ ఆఫ్ వార్ కథను కుమారస్వామి వైభవంతో స్టోరీని రెడీ చేసుకున్నారు గురూజీ. ఐతే ముందు ఈ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేశారు. గాడ్ ఆఫ్ వార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతుందనే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో ఇవన్నీ సక్సెస్ ఫుల్ సినిమాలే. ఐతే డబల్ హ్యాట్రిక్ కి నాంది పలికేలా ఈసారి మైథాలజీ కథతో అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేశారు త్రివిక్రమ్.

చేతిలో మురుగన్ బుక్ తో ఎన్టీఆర్..

ఐతే మధ్యలో ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతి నుంచి ఎన్టీఆర్ కి షిఫ్ట్ అయ్యింది. ఎన్టీఆర్ కూడా మురుగన్ బుక్ ని చేతిలో పట్టుకుని కనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఈ తరం హీరోల్లో మైథాలజీ అంటే గుర్తొచ్చే హీరో ఎన్టీఆర్. రాజమౌళితో యమదొంగ చేసిన అనుభవం ఉన్న తారక్ గాడ్ ఆఫ్ వార్ సినిమాకు పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించింది. ఐతే మళ్లీ ఎందుకో ఎన్టీఆర్ నుంచి అల్లు అర్జున్ దగ్గరకే గాడ్ ఆఫ్ వార్ వెళ్లిందని వార్తలు వచ్చాయి.

పుష్ప తర్వాత అల్లు అర్జున్ లైనప్ ఒక రేంజ్ లో ఉంది. ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ తో కలిసి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అంతేకాదు సందీప్ వంగ, సంజయ్ లీలా భన్సాలి ఇలా క్రేజీ డైరెక్టర్స్ అల్లు అర్జున్ తో సినిమాకు రెడీ అంటున్నారు. ఐతే మధ్యలో అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ నిర్మాత బన్నీ వాసు గాడ్ ఆఫ్ వార్ ఉంటుంది అన్నట్టుగానే హింట్ ఇచ్చాడు.

ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో గాడ్ ఆఫ్ వార్..

మరోపక్క ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత దేవర 2 చేసే ప్లాన్ లో ఉన్నాడు. గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ చేతి నుంచి వెళ్లిందన్న వార్తలు దాదాపు కన్ఫర్మ్ అనుకునే లోగా మళ్లీ త్రివిక్రమ్ తారక్ తోనే ఆ సినిమా చేస్తారన్న వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ముగించే సరికి త్రివిక్రమ్ కూడా వెంకటేష్ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం పూర్తి చేస్తాడు. సో ఇద్దరు కలిసి ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో గాడ్ ఆఫ్ వార్ ని సెట్స్ మీదకు తీసుకెళ్తారు అని టాక్. ఏది ఏమైనా ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఏది ఫిక్స్ అయ్యే అవకాశం లేదు. గాడ్ ఆఫ్ వార్ హీరో ఎవరు అన్న దాని మీద ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది కానీ దానికి ఒక క్లారిటీ మాత్రం రావట్లేదు.

Tags:    

Similar News