• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీక్వెల్ కోసం త‌రుణ్ ఏదో...

సీక్వెల్ కోసం త‌రుణ్ ఏదో గ‌ట్టిగానే ప్లాన్ చేశాడుగా!

| ఇప్ప‌టికే ప‌లు షెడ్యూళ్ల‌లో కొంత భాగం మేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ న‌గ‌రానికి ఏమైంది2 గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది.

By - Sravani Lakshmi Srungarapu
Update: 2026-02-07 02:45 GMT

టాలీవుడ్ లోని యూత్‌ఫుల్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ల‌లో ఈ న‌గ‌రానికి ఏమైంది కూడా ఒక‌టి. 2018లో రిలీజైన ఈ సినిమాకు అప్ప‌ట్లో చెప్పుకోద‌గ్గ క్రేజ్ ఏమీ రాలేదు. కానీ సినిమా ఓటీటీలోకి వ‌చ్చిన త‌ర్వాత రాను రాను క్రేజ్ ఎక్కువైపోయింది. ఆ క్రేజ్ వ‌ల్లే ఈ సినిమా రీరిలీజ్ కు ఆడియ‌న్స్ నుంచి విప‌రీత‌మైన స్పంద‌న వ‌చ్చింది. మొద‌ట్లో రిలీజైన‌ప్ప‌టి కంటే రీరిలీజ్ టైమ్ లోనే ఈ మూవీకి ఎక్కువ క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి.

ఏమైంది ఈ న‌గ‌రానికి మూవీకి సీక్వెల్ గా మూవీ..

విశ్వ‌క్ సేన్, అభిన‌వ్ గోమ‌టం, వెంక‌టేష్ కాకుమాను ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ ముగ్గురూ క‌లిసి గోవా వెళ్లి చేసే ర‌చ్చే ఈ న‌గ‌రానికి ఏమైంది కాగా, ఈ మూవీ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే దీనికి సీక్వెల్ రానుంద‌ని అన్నారు. కానీ సినిమా రిలీజై 8 ఏళ్లు అవుతున్నా ఇప్ప‌టికీ ఈ సినిమాకు సీక్వెల్ రాలేదు. రీసెంట్ గానే ఈ సీక్వెల్ సినిమా సెట్స్ పైకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

థాయ్‌లాండ్ లోనే ఎక్కువ భాగం షూటింగ్

సెట్స్ పైకి వెళ్లిన ఈ క్రేజీ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ప‌లు షెడ్యూళ్ల‌లో కొంత భాగం మేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ న‌గ‌రానికి ఏమైంది2 గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ హిట్ సినిమా సీక్వెల్ థాయ్‌లాండ్ లో జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఈ న‌గ‌రానికి ఏమైంది2 సినిమాలో దాదాపు 40% భాగాన్ని పూర్తిగా థాయ్‌లాండ్ లోనే షూట్ చేస్తున్నార‌ని వార్త‌లొస్తున్నాయి. చూస్తుంటే త‌రుణ్ భాస్క‌ర్ ఈ సీక్వెల్ విష‌యంలో ఏదో చాలా గ‌ట్టిగానే ప్లాన్ చేశార‌నిపిస్తోంది.

ఈ ఫ్రాంచైజ్ లో మొద‌టి భాగం గోవాలో ఎక్కువ‌గా షూటింగ్ జ‌రిగితే, సెకండ్ పార్ట్ థాయ్‌లాండ్ బ్యాక్ డ్రాప్ లో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న ఆడియ‌న్స్ ఈ సీక్వెల్ కేవ‌లం షూటింగ్ బ్యాక్ డ్రాప్ మాత్ర‌మే మారింద‌ని, ఎంట‌ర్టైన్‌మెంట్ మాత్రం అంత‌కంటే ఎక్కువ‌గా ఉండ‌నుంద‌ని భావిస్తూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

దీని వ‌ల్ల సినిమా బ‌డ్జెట్ కూడా పెర‌గ‌నుంద‌ని, మొద‌టి భాగం కంటే చాలా భారీ ఖ‌ర్చుతో ఈ సీక్వెల్ ను తెర‌కెక్కిస్తున్నార‌ని అంటున్నారు. లొకేష‌న్స్, ప‌ర్మిష‌న్లు, న‌టీన‌టుల రెమ్యూన‌రేష‌న్లు ఇలా ప్ర‌తీదీ చాలా భారీగానే ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తుంద‌ని, మ‌రి ఆ బ‌డ్జెట్ మొత్తాన్ని చిత్ర యూనిట్ తిరిగి రాబ‌ట్టుకోగ‌ల‌దా లేదా అనేది ఇప్పుడు డిస్క‌ష‌న్ గా మారింది.

Tags:    
  • eenagaranikiemaindi 
  • eenagaranikiemaindi2 
  • vishwaksen 
  • tarunbhascker 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS