సూర్యతో ఫిక్స్.. గురి పెట్టి మరీ వస్తున్నాడా..?

ఐతే కొన్నాళ్లుగా సూర్య స్ట్రైట్ తెలుగు సినిమాపై డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్ గా లాస్ట్ ఇయర్ లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య సినిమా సెట్స్ మీదకు వెళ్లింది.;

Update: 2026-02-07 07:09 GMT

మహేష్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేసిన తర్వాత ఏ డైరెక్టర్ కి అయినా వరుస ఆఫర్లు వస్తాయి. కానీ పరశురాం కు మాత్రం ఆ మ్యాజిక్ జరగలేదు. సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట సినిమా చేసిన ఈ డైరెక్టర్ నెక్స్ట్ ఛాన్స్ కోసం కాస్త వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఐతే విజయ్ దేవరకొండకు గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు కాబట్టి అతనితోనే ది ఫ్యామిలీ స్టార్ మూవీ చేశాడు. ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. ఐతే ఆఫర్ వెయిటింగ్ పరశురాం కి ఒక స్టార్ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తుంది.

పాన్ ఇండియా స్టార్ తో పరశురాం..

అది కూడా ఒక భాషకు సంబంధించిన స్టార్ కాదు పాన్ ఇండియా స్టార్ తో మూవీ ఓకే అయినట్టు తెలుస్తుంది. ఇంతకీ పరశురాం తో సినిమా చేస్తున్న స్టార్ ఎవరంటే కోలీవుడ్ స్టార్ అని టాక్. తమిళ సినిమాలే చేస్తున్నా కూడా తెలుగులో సూర్యకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అతను చేసిన గజిని సినిమా నుంచి సూర్యకు తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అప్పటి నుంచి సూర్య ఏ సినిమా వచ్చినా తెలుగు ఆడియన్స్ స్ట్రైట్ తెలుగు హీరోని ఆదరించినట్టు ఆదరిస్తారు.

ఐతే కొన్నాళ్లుగా సూర్య స్ట్రైట్ తెలుగు సినిమాపై డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్ గా లాస్ట్ ఇయర్ లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సూర్య సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. సితార బ్యానర్ లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఐతే ఈ సినిమా పూర్తి కాకముందే మరో తెలుగు సినిమా దాదాపు ఓకే అయినట్టే అని తెలుస్తుంది. పరశురాం పేట్ల డైరెక్షన్ లో సూర్య సినిమా ఉండబోతుందట. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ దిల్ రాజు నిర్మిస్తారట.

పూరీ జగన్నాథ్ లా తక్కువ టైం లో సినిమా పూర్తి చేస్తాడన్న పేరు..

సూర్య, పరశురాం, దిల్ రాజు ఈ కాంబినేషన్ లో ఒక భారీ సినిమా రాబోతుంది. కచ్చితంగా పరశురాం కి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు. కెరీర్ లో టఫ్ టైం నడుస్తున్న ఇలాంటి పొజిషన్ లో సూర్య సినిమా రావడం గొప్ప విషయం. ఐతే పరశురాం కూడా పూరీ జగన్నాథ్ లా తక్కువ టైం లో సినిమా పూర్తి చేస్తాడన్న పేరు ఉంది. సో కంటెంట్ బాగుంటే పెద్దగా ప్రొడక్షన్ కాస్ట్ వేస్ట్ అవ్వకుండా పరశురాం మూవీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాడు.

సూర్యతో పరశురాం ప్రాజెక్ట్ దాదాపు ఫిక్స్ అవ్వగా ఈ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించి బ్లాక్ బస్టర్ గురి పెట్టుకుని రంగంలోకి దిగుతున్నాడు పరశురాం. ఇంకా ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. వెంకీ తర్వాత పరశురాం తో సూర్య సినిమా అంటే తెలుగు మార్కెట్ మీద కోలీవుడ్ స్టార్ గురి మామూలు ప్లానింగ్ కాదంటున్నారు ఆడియన్స్.

Tags:    

Similar News