ఆ సంఘటనతో షాకయ్యా.. అందుకే కొట్టా!
సినీ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్, ఫాలోయింగ్ వేరు. అందుకే బయట ఎక్కడైనా వాళ్లు కనిపిస్తే వారిని జనాలు చుట్టుముడుతూ ఉంటారు.;
సినీ సెలబ్రిటీలకు ఉండే క్రేజ్, ఫాలోయింగ్ వేరు. అందుకే బయట ఎక్కడైనా వాళ్లు కనిపిస్తే వారిని జనాలు చుట్టుముడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు చాలా గుట్టుగా ఎవరికీ తెలియనట్టు మాస్క్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఎంత సీక్రెట్ గా బయటకు వచ్చి వెళ్దామన్నా కొన్నిసార్లు జనాలు వారిని కనిపెట్టేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారికి జనాల మధ్యలో ఇరుక్కుని పోవడం తప్పదు.
కొన్నిసార్లు అనుకోకుండా జనాల మధ్య చిక్కుకుంటే మరికొన్ని సార్లు మాత్రం షాప్ ఓపెనింగ్స్, మాల్ ఓపెనింగ్స్ లేదా ఏదైనా ఈవెంట్స్ లో భాగంగా ఆడియన్స్ వారిని చుట్టు ముట్టేస్తూ ఉంటారు. అంత మంది అభిమానుల ప్రేమను ఒకేసారి చూడటం కొందరికి గొప్ప అనుభూతుల్ని మిగిలిస్తే, మరికొన్ని సార్లు మాత్రం అది కొందరికి చేదు అనుభవాల్ని మిగులుస్తుంది.
హనీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన దివి
బిగ్ బాస్ తో మంచి ఫేమ్, క్రేజ్ తెచ్చుకున్న దివి కూడా ఇప్పుడలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నట్టు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దివి నటించిన హనీ మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు రాగా, మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దివి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల తానొక పబ్ ఈవెంట్ కు హాజరవగా, అక్కడ తనకు ఓ చేదు అనుభవం ఎదురైనట్టు దివి తెలిపారు.
అంతమంది మధ్యలో నడుము గిల్లాడు
ఆ ఈవెంట్ కు వెళ్లినప్పుడు తన చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నారని, గుంపుగా చుట్టూ ఉండి తనను తీసుకెళ్తున్నప్పటికీ, మధ్యలో ఒకడు వాళ్ల మధ్యలో నుంచి చేయి పెట్టి తన నడుమును గిల్లాడని, గిల్లడమే కాకుండా మళ్లీ ఏమీ తెలియనటటు నిల్చొని చూస్తున్నాడని, దాంతో తనకు బాగా కోపమొచ్చి, వెంటనే సీరియస్ గా చూసి తలపై గట్టిగా కొట్టి బాడకవ్ అని తిట్టి వెళ్లిపోయానని చెప్పారు.
తలపై గట్టిగా కొట్టి తిట్టేశా
ఒకవేళ తాను అలా తిట్టడం, కొట్టడం చేయకపోతే తర్వాత తాను బ్యాడ్ గా ఫీలవుతానని, అది తన తప్పు కాదని, చుట్టూ అంత మంది బాడీ గార్డ్స్ ఉన్నప్పటికీ వాడు నీచంగా బిహేవ్ చేశాడని, అప్పటివరకు తాను ఫ్రీ గా నడిచానని, కానీ ఆ సంఘటన తర్వాత జాగ్రత్తగా చేతులు దగ్గరికి పెట్టుకుని నడిచానని, ఆ ఇన్సిడెంట్ తనకు చాలా షాకింగ్ గా అనిపించిందని దివి చెప్పారు.
ఇక దివి కెరీర్ విషయానికొస్తే మోడలింగ్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన అమ్మడు మొదట్లో పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. మహర్షి మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దివి తర్వాత పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లోనూ, హీరోయిన్ గానూ నటించి మెప్పించారు. అయితే ఎన్ని సినిమాలు చేసినప్పటికీ దివికి భారీ పాపులారిటీ తీసుకొచ్చి పెట్టింది మాత్రం బిగ్‌బాస్‌నే.