హీరో ఇన్‌స్టా నుంచి కాపీ చేసాడు.. కరణ్‌పై మీమ్స్
నాగు పాముల ప్రపంచంలో నాగరాజు కథను తెరపైకి తెస్తున్నామని ప్రకటించింది ధర్మ ప్రొడక్షన్స్. నాగ్ జిల్లా అనేది సినిమా టైటిల్.;

నాగు పాముల ప్రపంచంలో నాగరాజు కథను తెరపైకి తెస్తున్నామని ప్రకటించింది ధర్మ ప్రొడక్షన్స్. నాగ్ జిల్లా అనేది సినిమా టైటిల్. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ ఇచ్ఛాధారి నాగ్ పాత్రను పోషిస్తున్నారు. ఇంతకుముందే ఈ సినిమా గురించి ప్రకటించగా, ఏక్తా కపూర్ నాగిన్ తరహాలో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ట్రై చేస్తున్నారని భావించారు. తాజాగా కార్తీక్ ఆర్యన్ పోస్టర్ ని ధర్మ సంస్థ రిలీజ్ చేయగా, దీనిని కాపీ క్యాట్ పోస్టర్ అంటూ రెడ్డిటర్లు విమర్శించారు.
కార్తీక్ అభిమానులు అతడిని సోషల్ మీడియాలో నిరంతరం వెంబడిస్తూ ప్రతి అప్‌డేట్ ని క్యాచ్ చేస్తుంటారు. ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లోని ఫోటోని కార్తీక్ ఆర్యన్ ఇన్ స్టా నుంచి కాపీ చేసారని ఫ్యాన్స్ గమనించారు. పోస్టర్‌లో కార్తీక్ ఆర్యన్ ఇచ్ఛాధారి నాగ్ పాత్రలో కనిపించాడు. అయితే కొద్దిరోజుల క్రితం కార్తీక్ ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ ని ఈ పోస్టర్ తయారీ కోసం ఉపయోగించారని రెడ్డిటర్లు కనుగొన్నారు. కరణ్ బృందంలో క్రియేటివిటీ అయిపోయిందని, కొత్తగా ఏదీ క్రియేట్ చేయరని విమర్శించారు.
తాజా పోస్టర్ లుక్ చూడగానే ఇందులో కార్తీక్ ఆర్యన్ కోడె నాగును గుర్తు చేస్తున్నాడు. అతడి శరీరంలో రూపురేఖల మార్పు స్పష్ఠంగా గమనించవచ్చు. అతడిని పాములు చుట్టుకుని కనిపిస్తున్నాయి. పాముల డెన్ - నాగ్ జిల్లా పోస్టర్ లో కనిపిస్తోంది. పోస్టర్ లో షర్ట్ లెస్ లో కార్తీక్ ని ఆవిష్కరించారు.. అతడి శరీరంలో మార్పును ప్రదర్శించడం ద్వారా అతడు నాగుపాముకు ప్రతిరూపం అని క్లారిటీ ఇచ్చేసారు. కార్తీక్ నగరం వైపు అందమైన దృశ్యాన్ని చూస్తూ నిలుచుని ఉన్నాడు. అతడి వీపు భాగం లో మార్పును కెమెరా స్పష్ఠంగా చూపిస్తోంది.
ఇటీవలి కాలంలో బాలీవుడ్ లో రీమేక్ లు ఎక్కువయ్యాయి. ఒరిజినల్ కథలు లేవు. క్రియేటివిటీ కరువైందని విమర్శలున్నాయి. పోస్టర్లు సహా ప్రతిదీ కాపీ చేస్తుండడంతో రెడ్డిటర్లు కామెడీలు చేస్తున్నారు. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఇలా ఇన్ స్టాలోంచి ఫోటోని ఉపయోగించి పోస్టర్ ని డిజైన్ చేయడాన్ని రెడ్డిటర్లు తప్పు పడుతున్నారు.