సహజ నటి కోడళ్ల గురించి ఈ విషయం తెలుసా..?

స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనకు తానే సాటి అనిపించుకున్న జయసుధ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది.

Update: 2024-03-09 03:56 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సహజ నటిగా ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు జయసుధ. ఎన్.టి.ఆర్, ఏఎన్నార్ టైం నుంచి ఈ తరం హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటూ తన అనుభవాన్ని.. ప్రతిభని ఇప్పటికీ చూపిస్తూ వస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తనకు తానే సాటి అనిపించుకున్న జయసుధ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ ఆ డీటైల్స్ అంతగా బయటకు రాలేదు.

తెలుగు పరిశ్రమలో తనదైన నటనతో మెప్పిస్తూ వచ్చిన జయసుధ రాజేంద్ర ప్రసాద్ అనే అతన్ను పెళ్లాడి 3 ఏళ్లకే డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ ప్రొడ్యూసర్ నితిన్ కపూర్ ని పెళ్లాడారు. నితిన్ కపూర్ తో 1985 లో జయసుధ పెళ్లి జరిగింది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దబ్బాయి నిహార్ కపూర్ సినిమాల మీద ఆసక్తి తో అడపాదడపా ఆ ప్రయత్నాలు చేస్తున్నాడు. యాక్టింగ్ తో పాటు అతను రెస్టారెంట్ బిజినెస్ కూడా చేస్తాడని తెలుస్తుంది. పెద్ద కోడలు ఒక ఇంటీరియర్ డిజైనర్ అని రీసెంట్ ఇంటర్వ్యూలో జయసుధ వెల్లడించారు. తన కోడలితో కలిసి సాస్ బహు బిజినెస్ కూడా స్టార్ట్ చేశామని చెప్పారు జయసుధ.

Read more!

జయసుధ చిన్నబ్బాయి శ్రేయాన్ ఇండియా టీం షూటర్ కోచ్ గా పనిచేశాడని. ప్రస్తుతం అతను తన వైఫ్ ప్రెగ్నెన్సీ కారణంగా లీవ్ లో ఉన్నాడని చెప్పారు. శ్రేయాన్ ఫారినర్ ని పెళ్లి చేసుకున్నాడు. మేమంతా మా ఫ్యామిలీని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నామని అన్నారు. చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా ఉండటం ఇష్టం. అందుకే పిల్లలకు కూడా అదే ఇండివిడ్యువాలిటీ వచ్చింది. అయితే అందరం పక్క పక్కనే ఉంటూ రెగ్యులర్ గా కలుస్తూ ఉంటామని అన్నారు జయసుధ.

నిన్నటితరం తారగా జయసుధ ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు. ఎన్నో అద్భుతమైన పాత్రల్లో మెప్పించారు. ఆమె వారసత్వాన్ని తన కొడుకులు కొనసాగించాలని అనుకున్నా అది కుదరలేదు. పెద్దబ్బాయి నిహార్ కపూర్ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అతను సక్సెస్ అవ్వలేకపోతున్నాడు.

Tags:    

Similar News