చీరకట్టులో అనసూయ గ్లామర్ టచ్!
క్లాసిక్ వైట్ బ్లాక్-ప్రింటెడ్ స్ట్రిప్స్ పాటర్న్‌తో ఉన్న ఈ చీరకు మ్యాచింగ్‌గా ఆలివ్ గ్రీన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి ఎంతో అందంగా మెరిసిపోయింది.
బుల్లితెరపై యాంకర్‌గా రచ్చ చేసి, వెండితెరపై నటిగా తనదైన ముద్ర వేసిన అందాల భామ అనసూయ భరద్వాజ్ తాజాగా పోస్ట్ చేసిన చీరకట్టు ఫోటోలు ఇంటర్నెట్‌లో షేక్ చేస్తున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లోనూ తనదైన గ్లామర్ టచ్ ఇస్తూ, కర్లీ హెయిర్‌తో ఆమె ఇచ్చిన పోజులు కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ట్రెండింగ్‌లో ఉండే ఈ గ్లామరస్ యాంకర్, లేటెస్ట్‌గా పంచుకున్న ఈ స్టైలిష్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ విశేషాలు మీకోసం..
ఆలివ్ గ్రీన్ చీరలో ఎలిగెంట్ లుక్:
తాజా ఫోటోషూట్ కోసం అనసూయ ఆలివ్ గ్రీన్ కలర్ జార్జెట్ చీరను ఎంచుకుంది. క్లాసిక్ వైట్ బ్లాక్-ప్రింటెడ్ స్ట్రిప్స్ పాటర్న్‌తో ఉన్న ఈ చీరకు మ్యాచింగ్‌గా ఆలివ్ గ్రీన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధరించి ఎంతో అందంగా మెరిసిపోయింది. ఇక దీనికి తోడు ఓపెన్ అండ్ ఓవీ కర్లీ హెయిర్‌స్టైల్ జతచేసి ఇచ్చిన పోజులు ఆమె లుక్‌కు ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెట్టాయి.
ఫ్యాన్స్ ఫిదా.. కామెంట్ల వర్షం :
సోషల్ మీడియాలో ఈ పిక్స్ షేర్ చేసిన క్షణాల్లోనే విపరీతంగా వైరల్ అయ్యాయి. అనసూయ అందాన్ని చూసి ఫిదా అయిన అభిమానులు "బ్యూటిఫుల్", "క్యూట్", "నైస్", "ఈ లుక్‌లో నువ్వు నిజంగా మైమరపిస్తున్నావ్" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక నిత్యం ఫిట్‌నెస్, వర్కౌట్ వీడియోలతో పాటు ఇలాంటి గ్లామరస్ ఫోటోషూట్లతో అనసూయ నెటిజన్లను అలరిస్తోంది.
'రంగమ్మత్త' నుంచి నేషనల్ వైడ్ గుర్తింపు:
'జబర్దస్త్' షో ద్వారా తన వాక్చాతుర్యంతో, అందంతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న అనసూయ, ఆ తర్వాత వెండితెరపై నటిగా ప్రయాణం ప్రారంభించింది. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా, 'పుష్ప'లో దాక్షాయినిగా ఐకానిక్ పాత్రల్లో నటించి అందరినీ మెప్పించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు కొన్ని ప్రత్యేక పాటల్లో మెరిసి ఇండ్రస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.
సామాజిక అంశాలు అండ్ కాంట్రవర్సీలు :
కేవలం నటనకే పరిమితం కాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే అనసూయ, సమాజంలోని పలు అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. కొన్నిసార్లు ఆమె చేసే కామెంట్లు, బోల్డ్ కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఇక అటు సినిమాలు, ఇటు సోషల్ మీడియా గ్లామర్‌తో నిత్యం వార్తల్లో నిలిచే అనసూయ భరద్వాజ్, రాబోయే రోజుల్లో కూడా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని అభిమానులు ఆశిస్తున్నారు.