మతం పేరుతో ట్రోలింగ్.. ఫరియా రియాక్షన్ ఇలా!

ఇక్కడే ఫరియా మాటల్లోని అసలు పాయింట్ కనిపిస్తోంది. తనను అందరూ అర్థం చేసుకోవాలని ఆమె కోరుకోవడం లేదు.

Update: 2026-09-17 06:30 GMT

జాతిరత్నాలులో చిట్టిగా తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు తన మాటలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్క్రీన్ పై ఎంత సరదాగా కనిపిస్తుందో.. బయట కూడా అంతే ఓపెన్‌ గా తన మనసులో మాట చెప్పే ఆ బ్యూటీ.. రీసెంట్ గా తనపై జరిగిన సోషల్ మీడియా ట్రోలింగ్ గురించి మాట్లాడారు. అయితే ఈసారి కూడా ఆమె మాటల్లో కోపం కంటే.. ప్రేమ గురించే ఎక్కువగా వినిపించింది.

హైదరాబాద్‌ లో బోనాల సందర్భంగా ఫరియా అబ్దుల్లా అమ్మవారిని దర్శించుకోవడం, బోనం సమర్పించడంతో కొందరు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేశారు. ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ ఫుల్ గా ట్రోల్ చేశారు. ఆ వ్యవహారంపై అప్పట్లోనే ఫరియా ఎమోషనల్ గా రెస్పాండ్ అయింది. ఇప్పుడు తన కొత్త సినిమా సిగ్మా ప్రెస్‌ మీట్‌ లో మరోసారి ఆ ఘటన గురించి మాట్లాడింది. సోషల్ మీడియా పోస్ట్‌ కు వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయిందట.

ముఖ్యంగా ఆ వివాదంలో పాత ఆలోచనలు తనకు కనిపించాయని తెలిపారు. 2026లో ఉన్నామని.. కానీ కొందరి ఆలోచనా విధానం మాత్రం ఇంకా పాత రోజుల్లోనే ఉందంటూ కౌంటర్ ఇవ్వడం గమనార్హం. తాను మాత్రం అందరినీ ప్రేమించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా తన అభిప్రాయాలను చెప్పుకునే ఒక ప్లాట్ ఫామ్ మాత్రమేనని, ప్రతి ఒక్కరికీ తమకంటూ ఓ అభిప్రాయం ఉంటుందని.. అది నచ్చకపోయినా వారి ఆలోచనను గౌరవిస్తానని తెలిపింది.

ఇక్కడే ఫరియా మాటల్లోని అసలు పాయింట్ కనిపిస్తోంది. తనను అందరూ అర్థం చేసుకోవాలని ఆమె కోరుకోవడం లేదు. తన ఆలోచన నచ్చినవాళ్లు దాన్ని రిసీవ్ చేసుకుంటే చాలని చెబుతోంది. ఎదుటివాళ్లను మార్చాలని ట్రై చేయడం కంటే.. ఎవరి ఆలోచన వాళ్లకు ఉండనివ్వాలన్నదే ఆమె మాటల్లో కనిపించింది. చిట్టిగా ప్రేక్షకుల ప్రేమను అందుకున్న ఫరియా.. నిజ జీవితంలో కూడా అదే ప్రేమను కోరుకుంది.

కానీ బోనాల ఘటనలో ఆమెకు ఎదురైంది మాత్రం ట్రోలింగ్. అయినా దానికి అదే రేంజ్ లో రెస్పాండ్ అవ్వకుండా.. అందరికీ పీస్, లవ్ అనే తన ఆలోచనను మరోసారి చెప్పింది. ప్రస్తుతం ఫరియా ఫోకస్ మాత్రం సిగ్మాపైనే ఉంది. దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా.. ఫరియా హీరోయిన్‌ గా కనిపించనుంది.

అక్టోబర్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియెన్స్ లో మూవీపై పాజిటివ్ బజ్ నెలకొంది. అందుకే బోనాల వివాదంపై ఎక్కువగా మాట్లాడకుండా.. సినిమా గురించే మాట్లాడాలని ఫరియా భావిస్తోంది. అలా తనను ఎంతగా ట్రోల్ చేసినా.. తన ఆలోచన మాత్రం మారదని ఆమె కామెంట్స్ చెబుతున్నాయి.

Tags:    

Similar News