స్టార్ హీరో 50వ చిత్రం అటా? ఇటా?
అయితే ఈ ప్రతిష్టాత్మక 50వ చిత్రాన్ని సూర్య సొంత పరిశ్రమ యిన తమిళ దర్శకుడితో పూర్తిచేస్తారా? లేక తెలుగు దర్శకుడితో తెరకెక్కిస్తారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
కోలీవుడ్ స్టార్ సూర్య వరుస పరాజయాల తర్వాత మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెలిసిందే. `కరుపు`, `విశ్వనాధ్ అండ్ సన్స్` వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. రెండు విజయాలు సూర్య మార్కె ట్ ను అంతకంతకు రెట్టింపు చేసాయి. ఈ నేపథ్యంలో సూర్య ల్యాండ్ మార్క్ 50వ చిత్రంపై అప్పుడే మీడియా కథనాలు అంతకంతకు వెడెక్కిస్తున్నాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక 50వ చిత్రాన్ని సూర్య సొంత పరిశ్రమ యిన తమిళ దర్శకుడితో పూర్తిచేస్తారా? లేక తెలుగు దర్శకుడితో తెరకెక్కిస్తారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది.
కెరీర్ ఆరంభం నుండి ప్రయోగాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ అపారమైన మార్కెట్ ..భారీ అభిమాన గణం ఉంది. ఈ నేపథ్యంలో 50వ సినిమా విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సూర్య సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఈ మైల్‌స్టోన్ అత్యంత ప్రత్యేకమైనది కావడంతో కథ, దర్శకుడి ఎంపికపై అప్పుడే కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్ల పేర్లు సూర్య 50 ప్రాజెక్ట్ కోసం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో కమర్షియల్ విజయాలకు కేరాఫ్ గా మారిన ఓ దర్శకుడి పేరు తెరపైకి వస్తుంది. అతడి కెరీర్ లో ఇంతవరకూ ఒక్క వైఫల్యం కూడా లేదు. సీనియర్లను డైరెక్ట్ చేసిన అనుభవం కూడా ఉంది. ఇటీవలే అతడు ఓ లైన్ కూడా వినిపించగా పాజిటివ్ గా స్పందించారుట సూర్య. ఈ సినిమాను నిర్మించేందుకు ఓ తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ కూడా ఆసక్తి చూపిస్తోందని తెలిసింది.
మరోవైపు సూర్య సొంత ఇండస్ట్రీ అయిన తమిళ పరిశ్రమకే చెందిన ప్రతిభావంతులైన దర్శకుల వైపే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. మారి సెల్వరాజ్ , నెల్సన్ దిలీప్‌కుమార్ వంటి స్టార్ డైరెక్టర్ల పేర్లు ఈ రేసులో ముందంజలో ఉన్నాయి. పవర్ ఫుల్ మెసేజ్ ఉన్న డ్రామాతో లేదా హై-వోల్టేజ్ యాక్షన్ కంటెంట్‌తోనే మాతృభాషలో 50వ చిత్రం చేయాలని తమిళ సినీ విశ్లేషకులు గట్టిగా విశ్వసిస్తున్నారు.
అయితే ప్రస్తుత రోజుల్లో భాషా సరిహద్దులు చెరిగిపోయి ప్యాన్-ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. కాబట్టి దర్శకుడు తెలుగువారా? లేక? తమిళవారా? అన్నదాని కంటే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సార్వజనీనమైన కథ ఉందా ?లేదా ?అనే అంశానికే సూర్య తొలి ప్రాధాన్యత ఇస్తారు. నటనలోని నూతన కోణాన్ని ఆవిష్కరిస్తూనే గ్లోబల్ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు అనువైన మాస్-క్లాస్ సబ్జెక్ట్‌ను ఎంచుకునే అవకాశః ఉంది.
దీనిపై మరింత క్లారిటీ రావడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం సూర్య మాలీవుడ్ దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో సీన్ అనే చిత్రంలో నేటిస్తున్నారు. ఇది ఆయనకు 47వ చిత్రం. అలాగే 48వ చిత్రం జై భీమ్ దర్శకుడు జ్ఞాన్ వేల్ తెరకెక్కిస్తున్నారు. 50-48 మధ్యలో 49వ చిత్రం ఒకటుంది. దానికి సంబంధించి మాత్రం ఇంకా ఎలాంటి వార్త రాలేదు. 50వ చిత్రం కమిట్ అయ్యే ప్రోసస్ లోనే 49వ చిత్రం కూడా కమిట్ అయ్యే ఛాన్స్ ఉంది.