ఆ విషయంలో రష్మిక తర్వాతే ఎవరైనా!
ఈ ఏడాది చివర్లో రష్మిక మందన్న సినిమాల సందడి ఉండబోతుంది. వచ్చే నెలలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గత ఏడాది ఏకంగా అయిదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో 'ఛావా' ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఛావా సినిమా సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు, ఆ సినిమాలో రష్మిక పోషించిన యేసు బాయి పాత్రకు మంచి పేరును సొంతం చేసుకుంది. ఇంకా గత ఏడాదిలోనే వచ్చిన థామా, గర్ల్ ఫ్రెండ్ సినిమాలతోనూ రష్మిక మందన్న నటిగా మంచి దక్కించుకుంది. గత ఏడాది నటిగా సంతృప్తిని ఇచ్చే పాత్రలతో పాటు, కమర్షియల్‌గా సూపర్ హిట్ అయిన సినిమాలను చేయడం ద్వారా రష్మిక మందన్నకు గత ఏడాది గుర్తుండి పోతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ ఏడాది రష్మిక జోరు గత ఏడాది స్థాయిలో లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రష్మిక నటించిన కాక్‌టెయిల్ 2 మాత్రమే విడుదలైంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న...
ఈ ఏడాది చివర్లో రష్మిక మందన్న సినిమాల సందడి ఉండబోతుంది. వచ్చే నెలలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటించిన మొదటి సినిమా ఇదే కావడంతో ఆసక్తి మరింతగా పెరిగింది. రణబాలిలో రష్మిక లుక్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఇక రష్మిక నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ 'మైసా' సైతం ఇదే ఏడాదిలో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైసాను ఇప్పటికే విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల ఆలస్యం అయింది. ఈ ఏడాది చివరి వరకు అయినా మైసాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు.
ఎం ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్...
రణబాలి, మైసా సినిమాలతో ఈ ఏడాది రాబోతున్న రష్మిక మందన్న మరో వైపు అల్లు అర్జున్ నటిస్తున్న 'రాకా' సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇన్ని సినిమాలు ఉండగానే తాజాగా రష్మిక లెజెండ్రీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందబోతున్న 'ఎం ఎస్' సినిమాకు సైన్ చేసింది. ఇటీవల కమల్ హాసన్ చేతుల మీదుగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి లెజెండ్రీ సింగర్ బయోపిక్‌లో నటించే అవకాశం దక్కించుకోవడం అనేది కచ్చితంగా గొప్ప విషయం. రష్మికకు దక్కిన ఈ ఆఫర్‌ను అదృష్టంగా ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్స్ ఉండగా, సౌత్‌లోనూ చాలా మంది సీనియర్, జూనియర్ స్టార్ హీరోయిన్స్ ఉండగా రష్మికకి ఈ ఛాన్స్ దక్కడం అంటే మామూలు విషయం కాదు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఎం ఎస్ మూవీ...
రష్మిక గతంలో చేసిన పాత్రలు, ఆ పాత్రల్లో ఆమె కనబర్చిన పెర్ఫార్మెన్స్ కారణంగానే ఎంఎస్ సినిమాలో ఆమెను ఎంపిక చేసి ఉంటారు అనడంలో సందేహం లేదు. పాన్ ఇండియా రేంజ్ మూవీగా రూపొందబోతున్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈయన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి షూటింగ్ కు రెడీ అయ్యాడు. అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ అందించబోతున్న సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలువబోతుంది. ఒకే ఏడాదిలో ఇన్ని ప్రతిష్టాత్మక సినిమాలను చేయడం, గొప్ప లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సైన్ చేయడం కేవలం రష్మికకి మాత్రమే చెల్లిందని, ఈ రేంజ్‌లో సినిమాలను ఒప్పుకోవడం కేవలం రష్మికకే సాధ్యం అయిందని విశ్లేషకులు అంటున్నారు. మరికొన్ని బాలీవుడ్ సినిమాలు, బయోపిక్ ఒకటి కూడా వచ్చే ఏడాది ఆరంభంలో రష్మిక మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.