'మాయ లేడీ' టీజర్.. క్రేజీ లవ్ స్టోరీలా ఉందే!

టీజర్‌ లో హీరో రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు మేకర్స్. పెళ్లి, ప్రేమ విషయంలో తనకు అంతా క్లియర్‌ గా ఉందని భావించే యువకుడిగా రాకేష్ వర్రే కనిపించారు.

Update: 2026-09-17 10:23 GMT

టాలీవుడ్ యంగ్ హీరో, నిర్మాత రాకేష్ వర్రే నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాయ లేడీ. మధుమిత సర్కార్ హీరోయిన్‌ గా యాక్ట్ చేస్తుండగా, ప్రశంకర్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై రాకేశ్ వర్రే నిర్మిస్తున్నారు. సత్య, ఇంద్రజ, మైసూర్ సురేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ లో ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండగా, లేటెస్ట్ గా మాయ లీడర్ టీజర్ రిలీజైంది.

టీజర్‌ లో హీరో రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు మేకర్స్. పెళ్లి, ప్రేమ విషయంలో తనకు అంతా క్లియర్‌ గా ఉందని భావించే యువకుడిగా రాకేష్ వర్రే కనిపించారు. అయితే అనుకోకుండా అతని లైఫ్ లోకి మధుమిత సర్కార్ ఎంట్రీ ఇస్తుంది. హీరో ఊహించిన దానికి పూర్తిగా భిన్నమైన అమ్మాయిగా ఆమె రోల్ కనిపిస్తోంది. హీరోయిన్ ను కలిసిన తర్వాత హీరో జీవితం ఒక్కసారిగా మారిపోతుంది.

హీరోయిన్ గురించి తెలుసుకున్న కొద్దీ అతడిలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అదే సమయంలో ఆమె గురించి కొత్త విషయాలు బయట పడుతుండటంతో స్టోరీలో ట్విస్టులు మొదలవుతాయి. ముఖ్యంగా హీరో మాజీ లవర్ గురించి హీరోయిన్‌ కు తెలిసిన తర్వాత ఆమె బిహేవియర్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. హీరో ప్రేమలో ఉన్న సమయంలో కూడా హీరోయిన్ చూపించే అతి ప్రేమ, పిచ్చి పనులు నవ్వులు పూయించేలా ఉన్నాయి.

అలా సినిమాలో ప్రేమతో పాటు కామెడీకి కూడా ఇంపార్టెన్స్ ఉన్నట్లు టీజర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. సత్య తనదైన కామెడీ టైమింగ్‌ తో అలరించేలా కనిపించారు. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ సరదాగా సాగుతున్నాయి. అయితే ఇది కేవలం లవ్, కామెడీ సినిమా మాత్రమే కాదని టీజర్ చివర్లో వచ్చే సీన్స్ చెబుతున్నాయి. హీరో, హీరోయిన్ కలిసి విలన్స్ తో పోరాడే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడు 'నా లవ్ స్టోరీ లో విలన్ ఎవరో తెలుస్తోంది' అంటూ హీరో చెప్పే డైలాగ్‌ తో టీజర్ సినిమాపై ఇంట్రెస్ట్ ను మరింత పెంచింది. అసలు వీరి ప్రేమ కథలోకి విలన్ ఎవరు వస్తారు? హీరోయిన్ గురించి హీరోకు తెలియని విషయాలేంటి? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. ఇక విశాల్ చంద్రశేఖర్ ఆ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రీసెంట్ గా వచ్చిన మెలొడీ సాంగ్ కూడా లవ్ స్టోరీకి తగ్గ ఫీల్‌ ను తీసుకొచ్చింది. టీజర్‌ లో వైజాగ్ అందాలను ఇంకా బ్యూటిఫుల్ గా చూపించారు. కలర్ ఫుల్ విజువల్స్‌ తో సినిమా మంచి ఎంటర్టైనర్‌ గా ఉండేలా కనిపిస్తోంది. ప్రేమ, కామెడీ, సస్పెన్స్ తో కూడిన క్రేజీ లవ్ స్టోరీలా ఉండనుందని టీజర్ చెప్పకనే చెబుతోంది. మరి త్వరలో రిలీజ్ కానున్న మాయ లేడీ మూవీ థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News