ఆకాశంలో ఒక తార.. టైటిల్ సాఫ్ట్, రిలీజ్ ప్లాన్ మాత్రం స్ట్రాంగ్!

దుల్కర్ సల్మాన్ సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ఒక స్పెష‌ల్ ఫ్యాన బేస్ ఉంటుంది.

Update: 2026-09-17 06:41 GMT

దుల్కర్ సల్మాన్ సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ఒక స్పెష‌ల్ ఫ్యాన బేస్ ఉంటుంది. కథలో క్లాస్, పాత్రలో వైవిధ్యం, సినిమాకు భిన్నమైన టోన్.. ఆయన సినిమాలపై ఆసక్తిని పెంచుతుంటాయి. ఇప్పుడు అలాంటి అంచనాల మధ్య ఆకాశంలో ఒక తార నవంబర్ 20న థియేటర్లలోకి రాబోతోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా, సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్పడింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నవంబర్ 20గా ఫిక్స్ చేయడం వెనుక మార్కెట్ పరంగా కూడా ఇంట్రెస్టింగ్ బిజినెస్ లెక్కలు కనిపిస్తున్నాయి.




 


నవంబర్ అనేది పండుగ సీజన్‌కు ముందు వచ్చే కీలకమైన థియేట్రికల్ విండో. అక్టోబర్ దసరా హడావుడి తర్వాత, డిసెంబర్ క్రిస్మస్- న్యూ ఇయర్ సీజన్‌కు ముందు ఆడియ‌న్స్ ను థియేటర్లకు తీసుకురావడానికి నవంబర్‌లో మంచి ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా దుల్కర్‌కు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఉన్న గుర్తింపు ఈ సినిమాకు అదనపు బలం కావచ్చు. ఒకే భాష మార్కెట్‌పై ఆధారపడకుండా మల్టీలాంగ్వేజ్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉండటంతో నవంబర్ 20 డేట్‌ను మేకర్స్ వ్యూహాత్మకంగా ఎంచుకున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ఇక ఆకాశంలో ఒక తార అనే టైటిల్ కూడా ఈ సినిమాపై అంచనాలను మరో విధంగా పెంచుతోంది. దుల్కర్ సల్మాన్‌కు ఉన్న స్టార్ ఇమేజ్‌తో పోలిస్తే ఈ టైటిల్ చాలా సాఫ్ట్‌గా, పొయెటిక్ గా అనిపిస్తోంది. టైటిల్ వినగానే ఇది ఒక ప్రేమకథా? లేక బలమైన ఎమోషనల్ డ్రామానా? అనే ప్రశ్న సహజంగానే వస్తోంది. అయితే టైటిల్‌లో కనిపించే సాఫ్ట్‌నెస్‌నే సినిమా మొత్తం టోన్‌గా భావించాల్సిన అవసరం లేదు. కథలో మరో బలమైన అంశాన్ని దాచిపెట్టి, టైటిల్‌తో ఆడియ‌న్స్ లో క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం కూడా అయి ఉండొచ్చు.

మరోవైపు దుల్కర్‌కు తెలుగు ప్రేక్షకులతో ఇప్పటికే ఏర్పడిన కనెక్షన్ ఈ సినిమాకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఈసారి ఏకంగా తెలుగు టైటిల్‌తో రావడం ఆ కనెక్షన్‌ను మరింత నేరుగా టార్గెట్ చేస్తున్న సంకేతంగా కనిపిస్తోంది. దుల్కర్‌ క్లాస్ ఇమేజ్‌కు పవన్ సాదినేని టేకింగ్ ఎలా జతకానుందనే ఆసక్తి కూడా ఈ సినిమాపై ఉంది. దీంతో నవంబర్ 20 కేవలం రిలీజ్ డేట్‌గా కాకుండా, దుల్కర్‌కు మరో కొత్త తెలుగు కనెక్షన్‌ను టెస్ట్ చేసే డేట్ గా మారనుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News