కౌంట్ కన్నా అదే ఇంపార్టెంట్.. రష్మిక పెర్ఫెక్ట్ ప్లాన్!

ఇక్కడే రష్మిక ప్లానింగ్ మరోసారి కనిపించింది. మైసా పనులు కొనసాగుతుండగానే.. అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ షూటింగ్‌ లోకి కూడా అడుగుపెట్టారట.

Update: 2026-09-17 07:30 GMT

ఒక సినిమా సెట్స్‌ పై ఉంటే.. మరో మూవీ కోసం రెడీ అవుతోంది. ఒక ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవుతుందంటే.. వెంటనే ఇంకో మూవీని పట్టాలెక్కిస్తోంది. ఇలా వరుస సినిమాలను లైన్‌ లో పెట్టుకోవడమే కాదు.. వాటి షూటింగ్‌ ను కూడా ప్లాన్ ప్రకారం పూర్తి చేస్తూ వెళ్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం ఆమె స్పీడ్ చూస్తుంటే.. సినిమాలు ఒప్పుకోవడం ఒక ఎత్తైతే, వాటిని టీమ్ కు కంప్లీట్ చేయడం మరో ఎత్తు అన్నట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న సినిమాల్లో రణబాలికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఆ మూవీలో రష్మిక జయమ్మ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆ రోల్ కు సంబంధించిన షూటింగ్‌ ను రీసెంట్ గా కంప్లీట్ చేశారు. రష్మికకు సంబంధించిన సన్నివేశాలు పూర్తవ్వడంతో.. రీసెంట్ గా మూవీ టీమ్ కూడా సెండాఫ్ చెప్పి ఎమోషనల్ అయింది.

రణబాలి పని పూర్తయిన వెంటనే రష్మిక తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టారు. అందులో ఒకటి మైసా. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ మూవీలో రష్మిక గోండు గిరిజన యువతిగా కనిపించున్నారు. ఆ రోల్ కోసం ఆమె పూర్తిగా భిన్నమైన లుక్‌ లో కనిపిస్తున్నారు. మైసాలో ఇప్పటికే మోస్ట్ హార్డ్ షెడ్యూళ్లను పూర్తి చేశారు అయితే ఆమెకు సంబంధించిన మొత్తం షూటింగ్ మాత్రం ఇంకా మిగిలి ఉంది.

ఇక్కడే రష్మిక ప్లానింగ్ మరోసారి కనిపించింది. మైసా పనులు కొనసాగుతుండగానే.. అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ షూటింగ్‌ లోకి కూడా అడుగుపెట్టారట. ఆమెను క్యాస్టింగ్ లోకి తీసుకున్నట్లు ఇప్పటి వరకు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. కానీ రష్మిక రోల్ పై మాత్రం భారీ అంచనాలు నెలకొనగా, లేటెస్ట్ గా ఆమె ముంబై షెడ్యూల్ లో జాయిన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవే కాకుండా రష్మిక ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి లైఫ్ స్టోరీ ఆధారంగా రూపొందనున్న చిత్రంలో ఆమె లీడ్ పోషించనున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానుంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌ లో రానున్న ‘పుష్ప 3’లో మరోసారి శ్రీవల్లిగా కనిపించనున్నారు రష్మిక.

అలాగే రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న యానిమల్ పార్క్ లో గీతాంజలి రోల్ లో సందడి చేయనున్నారు. అయితే ఆ రెండు సినిమాలకు ఇంకా సమయం ఉంది. అంటే.. రష్మిక సినిమాల లిస్ట్ పెద్దదే. కానీ ఆ సినిమాలన్నింటినీ ఒకేసారి చేయకుండా.. ఒక్కో ప్రాజెక్ట్‌ ను ప్లాన్ ప్రకారం ముందుకు తీసుకెళ్తోంది. రణబాలి కంప్లీట్.. మైసా కీలక షెడ్యూళ్లు కంప్లీట్.. ఇప్పుడు రాకా సెట్స్‌ లోకి ఎంట్రీ! ఇలా సినిమా తర్వాత సినిమా పని పూర్తి చేస్తూ వెళ్తుండటంతో.. రష్మిక ప్లాన్ ఎంత పక్కాగా ఉందో తెలుస్తోంది.

Tags:    

Similar News