అమ్మని మర్చిపోలేక అలా చేయాల్సి వచ్చింది..!

ప్రస్తుతం బాలీవుడ్ లో తను నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది జాన్వి. అయితే ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో తన తల్లి చనిపోయినప్పుడు కొన్ని వార్తలు తనని బాధ పెట్టాయని వెల్లడించారు.

Update: 2024-05-23 08:26 GMT

భారతీయ సినిమాల్లో శ్రీదేవి చరిష్మా తెలిసిందే. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడ సత్తా చాటింది. శ్రీదేవి తర్వాత ఆమె నట వారసత్వాన్ని కొనసాగించాలని చూస్తున్నారు తనయురాలు జాన్వి కపూర్, ఖుషి కపూర్. జాన్వి కపూర్ ఇప్పటికే బాలీవుడ్ సినిమాలు చేస్తూ వస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు ఎన్.టి.ఆర్ తో దేవర సినిమాలో ఛాన్స్ అందుకుంది. చరణ్ 16వ సినిమాలో కూడా నటిస్తున్నారు జాన్వి కపూర్.

ప్రస్తుతం బాలీవుడ్ లో తను నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది జాన్వి. అయితే ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో తన తల్లి చనిపోయినప్పుడు కొన్ని వార్తలు తనని బాధ పెట్టాయని వెల్లడించారు. తన సినిమా చూడకుండానే తల్లి మృతి చెందడం తనను మానసికంగా ఎంతో కృంగ దీసిందని చెప్పిన జాన్వి కపూర్.. అంత బాధలో కూడా తన తొలి సినిమా ధడక్ ప్రమోషన్స్ లో పాల్గొన్నానని అన్నారు.

కేవలం సినిమా రిలీజ్ టైం లో ప్రమోషన్స్ చేయకపోతే బాగోదన్న ఆలోచనతో తను ధడక్ ప్రమోషన్స్ చేశా.. కానీ ఆ టైం లో తల్లి చనిపోయిందన్న బాధ తనకు లేదని వార్తలు రాశారు. అసలే బాధలో ఉన్న తనకు ఆ వార్తలు మరింత హర్ట్ అయ్యేలా చేశాయని జాన్వి చెప్పింది. అంతేకాదు ఆ టైం లో సినిమా ప్రమోషన్స్ కోసమే ఒక డాన్స్ షోకి వెళ్లే అక్కడ కూడా అమ్మ పాటలు మెడ్లీలా డాన్స్ చేస్తే అది చూసి తట్టుకోలేక షో మధ్యలోనే వెళ్లి కారులో కూర్చుని బాధపడ్డానని చెప్పుకొచ్చారు జాన్వి కపూర్.

Read more!

సినీ తారలకు కూడా మంచి చెడులు ఉంటాయని. వారికి మనసు ఉంటుంది.. అది బాధపడుతుందని ఆలోచించకుండా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు సృష్టిస్తుంటారు. వాటిని చూసి చాలామంది సెలబ్రిటీస్ బాగా పెయిన్ ఫీల్ అవుతుంటారు. అసలు విషయం వారికి తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తుంటారు. జాన్వి కూడా ఓ పక్క తల్లి దూరమై బాధలో ఉంటే ఆ టైంలో కొందరు తన మీద చేసిన మాటల దాడి ఇంకాస్త బాధ పెంచిందని అన్నారు జాన్వి కపూర్.

ఇక దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వి కపూర్ ఇక్కడ శ్రీదేవి లానే సత్తా చాటాలని అనుకుంటుంది. దేవర రిలీజ్ కాకుండానే చరణ్ బుచ్చి బాబు కాంబో సినిమా ఛాన్స్ అందుకుంది. రెండు సినిమాలు హిట్లు పడితే తెలుగులో జాన్వి వరుస ఛాన్సులు అందుకునే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News