• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇండియన్ 2 లోనే.. పార్ట్ 3...

ఇండియన్ 2 లోనే.. పార్ట్ 3 సర్ ప్రైజ్

| యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్, శంకర్ కలయికలో వస్తోన్న ఇండియన్ 2 మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.

By - Tupaki Desk
Update: 2024-07-11 15:30 GMT

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్, శంకర్ కలయికలో వస్తోన్న ఇండియన్ 2 మూవీ జులై 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. 28 ఏళ్ళ క్రితం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన ఇండియన్ మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఈ కారణంగానే మూవీపైన కొంత హైప్ క్రియేట్ అయ్యి ఉంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. శంకర్, కమల్ హాసన్ కలయిక అనేసరికి ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేశారు. అంచనాలకి తగ్గట్లు లేకపోవడంతో ఇండియన్ 2పై పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు.

హిట్ మూవీ సీక్వెల్ కాబట్టి కచ్చితంగా అటెన్షన్ ఉంటుంది. తెలుగు, తమిళ్ భాషలలో మొదటి రోజు ప్రేక్షకాదరణ బాగానే ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ 2 మూవీలో కమల్ హాసన్ సేనాపతి పాత్రలో మరోసారి తన విశ్వరూపం చూపించబోతున్నాడు. సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలలో నటించారు. ఇండియన్ 2లో కమల్ హాసన్ స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉంటుందనే మాట వినిపిస్తోంది.

ఇండియన్ 3లో అద్భుతమైన కంటెంట్ ని చెప్పబోతున్నారంటూ ఇప్పటికే కమల్ హాసన్ లీకులిచ్చారు. దీంతో ఇండియన్ 3 మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఆ సినిమా కోసం అయిన ఇండియన్ 2 సినిమా చూడాలని తమిళ్ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇండియన్ 3 మూవీ ట్రైలర్ ని ఇండియన్ 2 సినిమాకి జత చేశారనే ప్రచారం కూడా నడుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఇండియన్ 2 మూవీ క్లైమాక్స్ లో ఇండియన్ 3 ట్రైలర్ ప్లే చేస్తామని తెలిపారు.

ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇండియన్ 2 రిలీజ్ ఆయిన 6 నెలల్లోనే ఇండియన్ 3 మూవీ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. కచ్చితంగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులని విశేషంగా అలరిస్తాయని నమ్మకంగా ఉన్నారు. మేకర్స్ ఇచ్చిన క్లారిటీ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ చూడటం కోసం ఇండియన్ 2కి చాలా మంది వెళ్లాలని అనుకుంటున్నారంట. మూడు గంటలకి పైగా ఈ మూవీ నిడివి ఉంది.

శంకర్ నుంచి చివరిగా వచ్చిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు. ఆయన నుంచి ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసే మ్యాజిక్ మిస్ అయ్యింది. సోషల్ ఎలిమెంట్స్ ని కమర్షియల్ గా చెప్పడంలో కొంత తడబడ్డారు. అయితే ఇండియన్ 2, 3 సినిమాల విషయంలో మాత్రం ఒకప్పటి శంకర్ ని మళ్ళీ చూస్తారని మేకర్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

Tags:    
  • Indian2 
  • Kamalhaasan 
  • Shankar 
  • Kollywood 
  • Anirudh 
  • Indian3 
  • Kajalaggarwal 
  • Sjsurya 
  • Trailer 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS