• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హనీమూన్ ఎక్స్ ప్రెస్.....

హనీమూన్ ఎక్స్ ప్రెస్.. కింగ్ స్టాంప్ వేసేశాడు..!

| హనీమూన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కింగ్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెట్ లో రిలీజ్ చేశారు.

By - Tupaki Desk
Update: 2023-12-16 06:39 GMT

జోనర్ ఏదైనా సరే ప్రేక్షకుల మెప్పుపొందే ప్రయత్నంలో ఈమధ్య టాలీవుడ్ మేకర్స్ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. కంటెంట్ తో సినిమా చేస్తే ఎంకరేజ్ చేసేందుకు ఆడియన్స్ ఎప్పుడూ సిద్ధమే. అందుకే ఇప్పుడు న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా తమ సినిమాలను సరికొత్త పంథాలో తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నంతోనే వస్తున్న మరో సినిమా హనీమూన్ ఎక్స్ ప్రెస్. న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా కామెడీతో పాటుగా సోషల్ మెసేజ్ తో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు.


ఈ సర్ రియల్ రొమాంటిక్ కామెడీ సినిమాను NRI ఎంటర్టైన్మెంట్స్ (U.S.A), న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ లో కె.కె.ఆర్, బాల రాజ్ కలిసి ఈ మూవీ నిర్మిస్తున్నారు. చైతన్య రావు, హెబ్భా పటేల్ లీడ్ జంటగా నటిస్తున్న హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాను బాల రాజశేఖరుని డైరెక్ట్ చేస్తున్నారు. తణికెళ్ల భరణి, సుహాసిని ఈ సినిమాలో కీ రోల్స్ పోశిస్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణి మాలిక్ మ్యూజిక్ అందిస్తున్నారు.

హనీమూన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కింగ్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెట్ లో రిలీజ్ చేశారు. తనకు బాల చాలా తెలుగు. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిలిం & మీడియాలో అతను డీన్ గా పనిచేశారని అన్నారు. హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్స్ పోజర్ ని అన్నపూర్ణ స్టూడెంట్స్ తో పంచుకున్నారని అన్నారు. అతని వల్ల చాలా మందికి ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్ పీరియన్స్ వచ్చిందని చెప్పారు.

హనీమూన్ ఎక్స్ ప్రెస్ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటుగా స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ తో వస్తుందని అన్నారు. కల్యాణి మాలిక్ మెలోడీస్ క్యాచీగా రొమాంటిక్ గా ఉంటాయి. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా సూపర్ హిట్ అవుతుందని బలంగా నమ్ముతున్నానని అన్నారు నాగార్జున.

డైరెక్టర్ బాల రాజశేఖరుని మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా హాలీవుడ్ సినిమాలకు పనిచేశాను ఎప్పటి నుంచో తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నా ఇన్నాళ్లకు అది కుదిరిందని అన్నారు. తనని ఇండియాకు తీసుకొచ్చిన అమల అక్కినేనికి థాంక్స్ చెప్పారు బాల. తనని డీన్ గా తీసుకుని టాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యేలా చేశారు. నాగార్జున కూడా అన్ని విధాలుగా గ్రేట్ సపోర్ట్ అందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ ఫ్యామిలీ వాల్యూస్ తో పాటుగా ఆరోగ్యకరమైన హ్యూమర్ తో వస్తుందని అన్నారు.

Tags:    
  • Honeymoonexpress 
  • Firstlookposter 
  • Nagarjuna 
  • Biggbossseason7 
  • Romanticcomedy 
  • Dramamovie 
  • Balarajasekhar 
  • Chaitanyarao 
  • Hebbapatel 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS