ఈ అందానికి దాసోహం.. 70 మంది 13,500 గం.లు శ్ర‌మిస్తే!

దీనికోసం 20 మంది కళాకారుల బృందం 5,000 గంటల పాటు శ్ర‌మించారు. 2.8 మిలియన్ మైక్రో బగల్ పూసలను దుస్తులపై చేతితో ఎంబ్రాయిడరీ చేసారు.

Update: 2024-05-09 00:30 GMT

మెట్ గాలా 2024 ఈవెంట్ నుంచి ఫోటోలు అంత‌ర్జాలాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ వేదిక‌పై అందాల భామ‌ల వెరైటీ డిజైన‌ర్ లుక్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ సంవత్సరం 'స్లీపింగ్ బ్యూటీస్: రీవాకనింగ్ ఫ్యాషన్' కోసం.. సూపర్ మోడల్స్ బ‌రిలో దిగారు. గత రాత్రి టాప్ మోడ‌ల్ జిగి హడిద్ గోధుమ వ‌ర్ణం అప్పీల్ తో సందడి చేసారు. తెల్లటి ఆఫ్-ది-షోల్డర్ కార్సెట్ దుస్తులు, తెల్లటి సిల్క్ మోయిర్ కోట్ కింద బ్లాక్ డచెస్ శాటిన్ టిప్పింగ్ డ్రెస్ తో క‌నిపించారు. త‌న న‌డుము చుట్టూ ధరించే వ‌స్త్రంపై 3D పసుపు గులాబీలతో అలంకరించిన తీరు మ‌నోహ‌రంగా క‌నిపించింది.

 

కిల్ల‌ర్ లుక్స్ తో గుండెల్లో గుబులు రేపిన జిగి హ‌డిద్ మెట్ గాలా రూపాన్ని డిజైన్ చేయ‌డం కోసం ఎంత‌మంది ఎన్ని గంట‌లు శ్ర‌మించారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఈ డిజైన‌ర్ డ్రెస్ ని పూర్తిగా చేతితో తయారు చేయడానికి 70 కంటే ఎక్కువ మంది వ్యక్తుల బృందం 13,500 గంటలకు పైగా స‌మ‌యం తీసుకున్నారు. ముళ్ల అప్లిక్యూలను కలిగి ఉన్న పసుపు గులాబీల తోట కళాత్మకంగా కుద‌ర‌డానికి చాలా స‌మ‌యం కేటాయించాల్సి వ‌చ్చింది. భారీ స్కర్ట్ పై ఎంబ్రాయిడరీ చేయడానికి 40 మంది వ్యక్తుల బృందానికి 8,500 గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది. కార్సెట్ దుస్తులు హస్తకళ తో ఆకట్టుకునే ఫీట్... దీనికోసం 20 మంది కళాకారుల బృందం 5,000 గంటల పాటు శ్ర‌మించారు. 2.8 మిలియన్ మైక్రో బగల్ పూసలను దుస్తులపై చేతితో ఎంబ్రాయిడరీ చేసారు.

Read more!

 

హడిద్ వ్య‌క్తిగ‌త‌ స్టైలిస్ట్ మిమీ కట్రెల్ ఈ డిజైన‌ర్ లుక్ స్ఫూర్తి ఎక్క‌డి నుంచో చెప్పారు. ఇది నిజానికి మొక్కలతో ఉండే తోటలోని విగ్రహాల నుంచి ప్రేరణ పొందాన‌ని తెలిపారు. జిగి లుక్ కోసం మేము తీగలు-పూలతో కూడిన తోటలోని విగ్రహాలు .. నిర్మాణాత్మక రాతి స్తంభాలపై దృష్టి సారించాము. పురాతన ఇటాలియన్ తోటలను ప‌రిశీలించి చాలా ప్రేరణ పొందాను. ఒక రాతికి వ్యతిరేకంగా కాంతి అందమైన పసుపు టోన్‌లను ఎలా ప్రతిబింబిస్తుందో చూడ‌టం నాకు చాలా ఇష్టం. ఇది జిగి రూపానికి స్ఫూర్తిగా మారింద‌ని క‌ట్రెల్ తెలిపారు. ''జిగి ఇంతందంగా జీవం పోసుకోవడం ఎల్లప్పుడూ ఒక విశేషం'' అని స‌హ‌చ‌రుడు బ్రౌన్ చెప్పాడు. జిగి ఏ పని చేసినా ప్రకాశించే న‌క్ష‌త్రంలా క‌నిపిస్తుందని ప్ర‌శంసించారు.

 

అంబానీ ఈవెంట్లో జిగి హడిద్ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్స‌వ వేడుక జాతీయ అంత‌ర్జాతీయ‌ సినీతార‌ల న‌డుమ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో బాలీవుడ్ అందాల న‌టీమ‌ణుల‌తో పాటు హాలీవుడ్ నుంచి ప‌లువ‌రు ప్ర‌తిభావంత‌మైన తార‌లు ఈ వేడుక‌కు విచ్చేశారు. ఈ వేడుక‌లో జిగి హ‌డిద్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

 

అయితే ఈ వేడుక‌లో ఊహించ‌ని ఓ ఘ‌ట‌న కూడా అంద‌రి క‌ళ్ల‌ను ఆక‌ర్షించింది. వేడుక నుంచి ఒక‌ వీడియోలో నిర్మాత బోనీ కపూర్ అంతర్జాతీయ మోడల్ జిగి హడిద్ న‌డుముపై చేయి వేయ‌డం కనిపిస్తాడు. ఇది నెటిజనుల్లో డిబేట్ కి తెర తీసింది. అత‌ని (బోనీ) వయస్సు 67 సంవత్సరాలు. జిగి హడిద్ వయసు 27. ఆమె నడుముపై గిల్లే బదులు అతడు గౌరవాన్ని కొంతైనా కాపాడుకోవాల్సిందంటూ నెటిజ‌నులు విమ‌ర్శించారు. ఆ ఈవెంట్ త‌ర్వాత మ‌ళ్లీ మెట్ గాలా 2024 ఈవెంట్ కోసం జిగి హ‌డిద్ ఇండియాలో అడుగుపెట్టారు.

Tags:    

Similar News