ఉస్తాద్ పెంచుతాడా? తగ్గుతాడా?
అయితే త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది.;
తెలుగు సినిమా టికెట్ ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. అందులోనూ స్టార్ హీరోల సినిమా టికెట్ ధరల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. సినిమా సినిమాకు టికెట్ ధర అమాంతం పెంచేస్తారు. బ్లాక్ మార్కెట్ ధర గురించైతే చెప్పాల్సిన పనిలేదు. రెండు..మూడు..నాలుగు వేలు అంటూ ఎంతకైనా డిమాండ్ ను బ్లాక్ మార్కెట్ దందా నడుస్తుంది. టికెట్ ధర పెంచడానికి రకరకాల కారణాలు చెబుతుంటారు. ప్రముఖంగా సినిమా బడ్జెట్ ఆధారంగానే పెంచుతున్నామనే అంశం తెరపైకి వస్తుంది. ఇదంతా అందరికీ తెలిసిందే.
అయితే త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. మార్చి 26 రిలీజ్ అనుకున్నారు. కానీ అంతకన్నా ముందే మార్చి 19 సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ ధర అంశం తెరపైకి వస్తోంది. ఈ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు టికెట్ ధర పెంచుతారా? లేక పాత ధరల ప్రకారం రిలీజ్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరలపై సన్నివేశం ఇలా ఉంది. టికెట్ ధరల పెంపు పై రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
సినిమా విడుదలకు 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు ఇవ్వాలని అందులో పేర్కొంది. మరి ఈ రకమైన ముందొస్తు అనుమతి ఉస్తాద్ భగత్ సింగ్ సంపాదించాడా? లేదా? అన్నది క్లారిటీ లేదు. ఏపీలో అయితే టికెట్ ధరలు పెంచుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రిలీజ్ కుముందు రోజైనా పెంపు అమలులోకి వచ్చేస్తుంది. పవన్ గత రెండు సినిమాలు పెంచిన టికెట్ ధరలతోనే రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలు కూడా వ్యకమయ్యాయి. టికెట్ ధరలు మరీ ఇంతలా పెంచేస్తే సామాన్యుడికి భారం కదా? అన్న అంశం తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' టికెట్ ధరలపై ఆ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది చూడాలి. మార్చి 19న `ధురంధర్ 2` ఎలాంటి టికెట్ ధరలు పెంచకుండానే రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియాలో ఆ సినిమా ఎలాంటి టికెట్ హైక్ లేకుండా రిలీజ్ అవుతున్నప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ సినిమా టికెట్ ధరలు పెంచకుండా రిలీజ్ చేయలేరా? అన్న ప్రశ్న ఉత్పన్న మవుతుంది. ఇది పవన్ కళ్యాన్ ని ఇరకాటంలో పెట్టేసే అంశంమే. గతంలో 'కల్కి' సినిమా రిలీజ్ సమయంలో టికెట్ ధరలు 1000 రూపాయలు పెంచుకోండని పవన్ చెప్పినట్లు నిర్మాత అశ్వినీ దత్ అన్నారు. కానీ అంత ధర పెట్టడం న్యాయం కాదని భావించి పెట్టలేదన్నారు. ఈ విషయంలో పవన్ పై అప్పట్లోనూ వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే.