రష్మిక లైనప్.. రెండేళ్లలో ఇంకెన్ని కోట్లు వస్తాయో?

ఆ తర్వాత వచ్చిన యానిమల్ ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. భారీ వసూళ్లతో పాటు నటిగా కూడా ప్రశంసలు అందుకుంది.

Update: 2026-06-22 16:31 GMT

ఒక హీరోయిన్ సినిమా హిట్ కావడం కామనే. కానీ ఆమె నటించిన సినిమాలు వరుసగా వందల, వేల కోట్ల వసూళ్లు సాధిస్తే మాత్రం అది చెప్పుకోవాల్సిన విషయమే. ప్రస్తుతం అలాంటి రేంజ్ లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న. స్టార్ హీరోల సరసన నటిస్తూ.. పాన్ ఇండియా మార్కెట్‌ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు బాక్సాఫీస్‌ కు లక్కీ ఛార్మ్‌ గా మారిపోయారు.

ఇప్పటికే ఆమె నటించిన సినిమాల ద్వారా రూ.4వేల కోట్లకు పైగా వసూళ్లు నమోదవ్వగా, రష్మిక చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులను చూస్తే.. రాబోయే రెండేళ్లలో ఆ నెంబర్ మరింత పెరగడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. నిజానికి రష్మిక కెరీర్‌ కు అతిపెద్ద టర్నింగ్ పాయింట్‌ గా నిలిచింది పుష్ప. శ్రీవల్లి రోల్ తో ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. పుష్ప 2తో ఆ క్రేజ్‌ ను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఆ తర్వాత వచ్చిన యానిమల్ ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. భారీ వసూళ్లతో పాటు నటిగా కూడా ప్రశంసలు అందుకుంది. తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రష్మిక.. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేయడమే కాకుండా.. కథకు ఇంపార్టెన్స్ ఉన్న చిత్రాల్లోనూ తన ముద్ర వేసింది. ‘ అయితే ప్రస్తుతం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నది ఆమె లైనప్.

విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న రణబాలిపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లోనూ రష్మిక కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ చిత్రం విజయం సాధిస్తే.. రష్మిక ఖాతాలో మరో బిగ్ హిట్ చేరే అవకాశం ఉందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఇక పుష్ప 3 కూడా ఆమె కెరీర్‌లో అత్యంత కీలక చిత్రాల్లో ఒకటిగా మారనుంది. ఇప్పటికే శ్రీవల్లి పాత్ర ప్రేక్షకుల్లో గుర్తింపు సంపాదించుకుంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా-రణబీర్ కపూర్ కాంబినేషన్‌ లో రాబోతున్న యానిమల్ పార్క్ కూడా ఆమె లైనప్‌ లో ఉంది. తొలి పార్ట్ సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఆ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

ప్రస్తుతం రష్మిక ఎంపిక చేసుకుంటున్న సినిమాలన్నీ పెద్ద స్థాయిలో రూపొందుతున్నవే. అందులో ఎక్కువ శాతం పాన్ ఇండియా ప్రాజెక్టులే కావడం విశేషం. ఆ చిత్రాలు అంచనాలకు తగ్గట్టు విజయాలు సాధిస్తే.. ఆమె స్టార్‌ డమ్ మరో మెట్టు ఎక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా రష్మిక కేవలం స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు.. బాక్సాఫీస్‌ కు బ్రాండ్‌ గా మారిన పేరు కూడా. ఇప్పుడు చేతిలో ఉన్న రణబాలి, అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్, పుష్ప 3, యానిమల్ పార్క్ వంటి భారీ సినిమాలను చూస్తే.. ఆమె బాక్సాఫీస్ కౌంట్ ఈ రెండేళ్లలో మరిన్ని కోట్ల మార్క్‌ ను కూడా దాటే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News