అహంకారం ఈ క‌మెడియ‌న్ జీరో అయిపోవ‌డానికి కార‌ణం!

చివ‌రికి భూమి గుండ్రంగా తిరిగి అక్క‌డికే వ‌చ్చిన‌ట్టు.. లైఫ్ అటూ ఇటూ తిరిగి మొద‌టికే వ‌చ్చింది. ఆ స్పీడ్ అనూహ్యంగా స్లోడౌన్ అయిపోయింది. అవ‌కాశాలు తెర‌మ‌రుగ‌య్యాయి.

Update: 2026-06-22 17:13 GMT

ఓవ‌ర్ నైట్‌లో బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి.. ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయని అంటారు! చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇలాంటి అనుభ‌వజ్ఞులు చాలా తార‌స‌ప‌డుతుంటారు. అనూహ్యంగా వెండితెర‌పై వెలుగులు విర‌జిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లే తారాజువ్వ‌లా క‌నిపించే ఆర్టిస్టులు ఉన్న‌ట్టుండి సినీవినీలాకాశం నుంచి స‌డ‌న్ గా అదృశ్య‌మ‌వుతుంటారు. అస‌లు వీళ్ల‌కు ఏమైంది? అని అభిమానులు ఆరా తీస్తే విస్మ‌య‌ప‌రిచే విష‌యాలు తెలుస్తుంటాయి.

ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్ ప‌త‌నం వెన‌క అస‌లు కార‌ణం చెప్పి పెద్ద షాకిచ్చాడు ఓ క‌మెడియ‌న్. ఒక‌దాని వెంట ఒక‌టిగా ఒకేసారి ప‌దుల సంఖ్య‌లో అవ‌కాశాలు వెంట‌ప‌డ‌టంతో తానేదో పెద్ద స్టార్ క‌మెడియ‌న్ అయిపోయానని భావించాడ‌ట‌. త‌న మొద‌టి సినిమా విజ‌యం సాధించాక స్వ‌ల్ప‌ వ్య‌వ‌ధిలోనే ఏకంగా 11 సినిమాల‌కు క‌మిట‌య్యాన‌ని చెప్పాడు. ఆ స్పీడ్.. ఆ దూకుడు చూసి ఇదంతా శాశ్వ‌తమేన‌ని గ‌ర్వించాడ‌ట‌.

చివ‌రికి భూమి గుండ్రంగా తిరిగి అక్క‌డికే వ‌చ్చిన‌ట్టు.. లైఫ్ అటూ ఇటూ తిరిగి మొద‌టికే వ‌చ్చింది. ఆ స్పీడ్ అనూహ్యంగా స్లోడౌన్ అయిపోయింది. అవ‌కాశాలు తెర‌మ‌రుగ‌య్యాయి. పిలిచి అవ‌కాశాలిచ్చేవాళ్లే క‌రువ‌య్యారు. ఈ ఊహించ‌ని ప‌రిస్థితికి స్ట‌న్న‌యిపోయాడ‌ట‌. చివ‌రికి ఫోటోలు పట్టుకుని ఎప్ప‌టిలాగే త‌న కెరీర్ ని రీలాంచ్ చేసాడు. ప్రారంభ‌ రోజుల్లో ఎలా తిరిగాడో గుర్తు చేసుకుంటూ అలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాడ‌ట‌. ఇప్ప‌టికీ ఇలా తిరుగుతూనే ఉన్నాన‌ని చెప్పాడు.

ఒకానొక‌ప్పుడు రాజ‌మౌళి, రాజీవ్ క‌న‌కాల వంటి ప్ర‌ముఖులు కొనుగోలు చేసిన మ‌ణికొండ ఏరియాలో త‌న‌ను కూడా ఒక భూమిని కొనుగోలు చేయ‌మ‌ని స‌న్నిహితులు సూచించార‌ట‌. ఆ స‌మ‌యంలో హెడ్ వెయిట్ దిగ‌క‌పోవ‌డంతో దానిని తిర‌స్క‌రించాడు.. ``అస‌లు చిరంజీవి ఎక్క‌డ ఉంటారో తెలుసా! అదే జూబ్లీహిల్స్ ఏరియాలో ఒక సొంత ఇంటిని కొని చూపిస్తాను చూడండి..`` అంటూ కాల‌ర్ ఎగ‌రేసాడ‌ట‌. నిజానికి ఒక ఆర్టిస్టు ద‌గ్గ‌ర ఉండ‌కూడ‌ని ల‌క్ష‌ణం ఇదేన‌ని ఇప్పుడు రియ‌లైజ్ అయిన‌ట్టు చెప్పాడు. కెరీర్ స్పీడ్ మీద ఉన్న‌ప్పుడు వ‌య‌సు చాలా చిన్న‌ది అని దాంతో పాటే త‌ప్పులు దొర్లిపోయాయ‌ని స‌ద‌రు క‌మెడియ‌న్ ఒప్పుకున్నాడు.

రంగుల ప‌రిశ్ర‌మ‌లో నేము, ఫేము ఉన్నంత‌వ‌ర‌కే. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో ఊహించ‌డం క‌ష్టం. ఇప్ప‌టికీ ఈ క‌మెడియ‌న్ సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అవ‌కాశాలు అభ్య‌ర్థిస్తున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్! అంటూ బ‌తిమాలుకుంటున్నాడు. ఇక జీవించడానికి బుల్లితెర కార్య‌క్ర‌మాల‌లోను భాగ‌మ‌వుతున్నాడు. స‌ద‌రు క‌మెడియ‌న్ ఎవ‌రు? అనేది అటుంచితే... అస‌లు సినీజ‌గ‌త్తులో ఆర్టిస్టు ప్ర‌వ‌ర్త‌న‌ ఎలా ఉండాలో అత‌డి జీవితం ఔత్సాహిక న‌టీన‌టుల‌కు ఒక పెద్ద గుణ‌పాఠం. ఇక్క‌డ `హెడ్ వెయిట్` అనేది ప‌నికిరాదు. త‌ల తిరుగుడు స‌మాధానాలు కుద‌ర‌దు. ఎంత‌గా ఒదిగి ఉంటే అంతగా మంచి జ‌రుగుతుంది. అలాగే డ‌బ్బు సంపాదించిన‌ప్పుడు ఎడా పెడా అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేయ‌కూడ‌దు. దానిని ర‌క‌ర‌కాల మార్గాల‌లో దాచుకోవాలి లేదా పెట్టుబ‌డులు పెట్టాలి. దుబారా చేయ‌కూడ‌దు!

Tags:    

Similar News