వంగా అంటే ఆ మాత్రం ఉండాలి కదా..

ఇప్పుడు ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఆ భారీ యాక్షన్ థ్రిల్లర్ విషయంలో అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం లొకేషన్ల సెలక్షన్.

Update: 2026-06-22 16:26 GMT

ఒక సినిమా తీయాలంటే కథ, హీరో, బడ్జెట్ మాత్రమే కాదు.. దర్శకుడి ఆలోచన కూడా ఎంత భిన్నంగా ఉంటుందో సందీప్ రెడ్డి వంగా మరోసారి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. తన కెరీర్ స్టార్టింగ్ నుంచి సొంత స్టైల్‌ తో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగా.. ఇప్పుడు స్పిరిట్ విషయంలో కూడా అదే మోడ్ ను కంటిన్యూ చేస్తున్నారు. అందరూ వెళ్లే దారిలో కాకుండా తనదైన శైలిలో ప్రయాణించడం ఆయన ప్రత్యేకత.

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు చూస్తే సందీప్ వర్క్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. పాత్రలను ఎంత నేచురల్ గా చూపించాలి, కథలోని ఎమోషన్స్ ఎంత బలంగా ప్రేక్షకులకు చేరవేయాలనే విషయంలో ఆయన ఎక్కడా రాజీ పడరు. అందుకే ఆయన సినిమాల్లో రియాలిటీకి పెద్దపీట ఉంటుంది. ఇప్పుడు స్పిరిట్ కోసం కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పుడు ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఆ భారీ యాక్షన్ థ్రిల్లర్ విషయంలో అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం లొకేషన్ల సెలక్షన్. ఇటీవల కాలంలో ప్రభాస్ సినిమాలు ఎక్కువగా భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ ఆధారంగా తెరకెక్కాయి. దీంతో ఒకప్పుడు కనిపించిన ప్రభాస్‌ లోని నేచురల్ స్క్రీన్ ప్రెజెన్స్ కొంత మిస్ అయిందనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమైంది.

ఆ ఫీడ్‌ బ్యాక్‌ ను దృష్టిలో పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ, వంగా మాత్రం ఈసారి భిన్నంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. సెట్స్ కంటే రియల్ లైఫ్ ఎన్విరాన్మెంట్ చూపించేందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు కనిపించని విధంగా పబ్లిక్ లొకేషన్లలో షూటింగ్ చేపడుతున్నట్లు సమాచారం.

ఇటీవల హైదరాబాద్‌లోని కొన్ని ప్రముఖ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను మూవీ టీమ్ షూట్ చేయగా, ప్రస్తుతం నేచురాలిటీ తీసుకురావడంపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. ప్రేక్షకులు చూస్తున్నది సినిమా సెట్ కాదు.. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గా అనిపించాలన్నదే వంగా ఆలోచనట! పోలీస్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఆ చిత్రానికి రా అండ్ రియలిస్టిక్ ఫీల్ తీసుకురావడానికి దర్శకుడు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.

అందుకే ప్రతి లొకేషన్ సెలక్షన్ నుంచి సీన్స్ షూటింగ్ వరకు నేచురాలిటీకి పెద్దపీట వేస్తున్నట్లు వినికిడి. సందీప్ రెడ్డి వంగా సినిమాల ప్రత్యేకత కూడా ఇదే. కథ ఎంత పెద్దదైనా, హీరో ఎంత స్టార్ అయినా.. తెరపై కనిపించే ప్రపంచాన్ని నమ్మేలా చేయడమే ఆయన లక్ష్యం. ఇప్పుడు స్పిరిట్ విషయంలో కూడా అదే ప్రయత్నం కనిపిస్తోంది. ప్రభాస్‌ కు ఉన్న భారీ మార్కెట్, వంగా టేకింగ్, రియలిస్టిక్ అప్రోచ్ కలిస్తే స్పిరిట్ మరో రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ప్రభాస్‌ తో సినిమా తీస్తే చాలదు.. సందీప్ రెడ్డి వంగా తీస్తే ఆ మాత్రం ప్రత్యేకత ఉండాల్సిందే కదా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News