ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి భార్య నుంచి మ‌రో షాక్‌!

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్న ఆయ‌నపై ముప్పెట దాడి జ‌రుగుతోంది.;

Update: 2026-03-07 09:16 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌కి దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. సినిమాల‌కు గుడ్ బై చెప్పేసి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తున్న ఆయ‌నపై ముప్పెట దాడి జ‌రుగుతోంది. ఆయ‌న న‌టించిన చివ‌రి సినిమా `జ‌న నాయ‌గ‌న్‌` జ‌న‌వరి 9న రిలీజ్ కావాల్సింది. ఈ సినిమాతో రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించాల‌ని ప్లాన్ చేసుకున్న విజ‌య్‌కి తీవ్ర నిరాశే ఎదురైంది. సెన్సార్ అభ్యంత‌రాలు చెప్ప‌డం, సెన్సార్ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డానికి ష‌రతులు విధించ‌డంతో సినిమా రిలీజ్ అర్థాంత‌రంగా నిలిచిపోయింది.

ఇదే స‌మ‌యంలో విజ‌య్ టీవీకే పార్టీ ప్ర‌చారంలో భాగంగా క‌రూర్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో తొక్కీస‌లాట జ‌ర‌గ‌డం, అందులో పిల్ల‌లు, పెద్ద‌లు, మ‌హిళ‌లు, యువ‌కులు దాదాపుగా 40 మందికి పైగా మృతి చెంద‌డంతో విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం కేసు న‌మోదు కావ‌డం, భారీ స్థాయిలో ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌డంతో సీబీఐ రంగంలోకి దిగి విచార‌ణ చేప‌ట్ట‌డంతో విజ‌య్‌కి కొత్త స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ్డాయి. పార్టీ జెండాపై కూడా వివాదం చెల‌రేగ‌డంతో ఈ అంశం కోర్టు దాకా వెళ్లింది.

హైకోర్టు తీర్పు ఇచ్చే వర‌కు విజ‌య్ పార్టీ జెండాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అనుకూలంగా తీర్పు రాక‌పోతే మాత్రం పార్టీ జెండా మార్చుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇదే స‌మ‌యంలో విజ‌య్‌పై త‌మిళ‌నాడు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌లు మ‌రో వివాదానికి తెర‌తీసి విజ‌య్‌ని ఇరుకున పెట్టాయి. త్రిష ఇంటి నుంచి విజ‌య్ బ‌య‌టికి వ‌స్తే బాగుంటుంద‌ని బీజేపీ నేత చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఇదే స‌మ‌యంలో విజ‌య్‌పై మ‌రో బాంబు ప‌డింది. ఆయ‌న భార్య సంగీత విజ‌య్ నుంచి విడాకులు కోరుతూ చెంగ‌ల్‌ప‌ట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టుని ఆశ్ర‌యించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఒక న‌టితో విజ‌య్ వివాహేత‌ర సంబంధ‌మే విడాకుల‌కు కార‌ణ‌మంటూ విడాకుల పిటీష‌న్‌లో సంగీత పేర్కొన‌డం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 27 ఏళ్ల వైవాహిక బంధానికి సంగీత ముగింపు ప‌ల‌క‌డంతో కోలీవుడ్ తో పాటు ద‌క్షిణాది అంతా షాక్‌కు గుర‌వుతోంది. ఇంత వ‌ర‌కు దీనిపై విజ‌య్ ఎలాంటి కామెంట్ చేయ‌క‌పోవ‌డం, రీసెంట్‌గా జ‌రిగిన ఓ వివాహ వేడుక‌లో త్రిష‌తో క‌లిసి పాల్గొన‌డంతో విడాకుల వివాదం మ‌రింత ముదిరే అవ‌కాశం ఉంద‌ని కోలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ వైఫ్ సంగీత తాజాగా మ‌రో బాంబ్ పేల్చి షాక్ ఇచ్చింది. చెంగ‌ల్‌ప‌ట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటీష‌న్ దాఖ‌లు చేసి షాక్ ఇచ్చిన సంగీత తాజాగా మ‌రో పిటీష‌న్ ఫైల్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విడాకులు కేసు పూర్త‌య్యే వ‌ర‌కు చెన్నై నీలంక‌రైలో ఉన్న ఇంట్లోనే త‌ను ఉండేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు. అంతే కాకుండా ఆ ఇంట్లో త‌న‌కూ హ‌క్కు ఉంద‌ని పిటీష‌న్‌లో పేర్కొని విజ‌య్‌కి షాక్ ఇచ్చారు. ఇప్పుడు విజ‌య్ ప‌రిస్థితి ఏంటీ? దీనిపై ఇప్ప‌టికైనా స్పందిస్తాడా? అని అంతా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News