రష్మిక‌పై విజ‌య్ అభిమానులు అంతగా ఒత్తిడి తెచ్చారా?

టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ -రష్మిక మందన్నల కెమిస్ట్రీ ప్రస్తుతం తెలుగు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

Update: 2026-10-05 03:28 GMT

టాలీవుడ్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ -రష్మిక మందన్నల కెమిస్ట్రీ ప్రస్తుతం తెలుగు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ జంట ప్రస్తుతం తమ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ `రణబాలి` సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా ప్రచార కార్యక్రమాలే అయినా.. ఈ జంట మధ్య ఉన్న అన్యోన్యత - క్యూట్ రొమాన్స్ యువహృదతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీరిని చూసిన అభిమానులు పర్ఫెక్ట్ కపుల్ అనే పదానికి సరిగ్గా సరిపోతారని కీర్తిస్తున్నారు. `రణబాలి`సినిమా గురించి ఎంత చర్చ జరుగుతుందో.. అంతకంటే ఎక్కువగా ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించే సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా ప్రముఖ యాంకర్ సుమతో జరిగిన చిట్‌చాట్‌లో విజయ్ - రష్మికల మధ్య ఉన్న రొమాంటిక్ క్యూట్ అనుబంధం మరింత ఆకర్షణీయంగా ఎలివేట్ అయింది. ఇద్దరి మధ్య ఉన్న ఆప్యాయత ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

విజయ్‌ను ఎంత బాగా చూసుకోవాలని ఫ్యాన్స్ `వదినమ్మ` రష్మికపై ఒత్తిడి తెస్తారో రష్మిక స్వయంగా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తల్లిదండ్రులు కూడా విజయ్‌ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారంటూ. అందుకోసమే కదా తాను పెళ్లి చేసుకుంటున్నది అంటూ రష్మిక చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిని, నవ్వులను పంచాయి. ఈ క్యూట్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే సందర్భంలో రష్మిక మాట్లాడుతూ.. పెళ్లికి ముందే అందరూ విజయ్‌ని బాగా చూసుకోవాలని అంటున్నారని.. త‌న త‌ల్లిదండ్రులు, అభిమానులు ఎంతో ప్రేమతో చెప్పినట్లుగానే తాను కూడా విజయ్‌ని అలాగే చూసుకుంటానని తెలిపారు. పెళ్లి తర్వాత కూడా విజయ్‌ని, కుటుంబ సభ్యులందరినీ ఎంతో ప్రేమగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని.. అందరినీ సంతోషంగా చూసుకోవడమే తన లక్ష్యమంటూ ప్రేమగా తన మనసులోని మాటలను బయటపెట్టారు.

ఇక `రణబాలి` సినిమా విషయానికి వస్తే.. ఇదొక పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అత్యంత సాహసోపేతమైన పవర్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్న అత‌డికి సరిజోడిగా ఒక ప్రాముఖ్యత ఉన్న పాత్రలో అలరించనున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ..బలమైన ప్రేమకథ ఈ సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ మూవీ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని ఇవ్వడం ఖాయమని మేకర్స్ నమ్ముతున్నారు. స్వాతంత్య్ర కాలానికి ముందు బ్రిటీష్ పాల‌న‌లోని ప‌రిస్థితుల‌ను ఈ చిత్రం క‌ళ్ల‌కు క‌ట్ట‌నుంది.

Tags:    

Similar News